దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు! భక్తుడి వింత నిర్ణయం

తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పులు తీర్చలేనంటూ మాయకుంట్ల మోహన్‌ ఏకంగా చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీకి ఐపీ నోటీసు పంపారు. ఆలయ కమిటీకి చెల్లించాల్సిన రూ.3 లక్షల బకాయితో పాటు మొత్తం 56 మంది నుంచి తీసుకున్న సుమారు రూ.1.65 కోట్ల అప్పులు తీర్చలేనని పేర్కొంటూ రుణదాతలందరికీ నోటీసులు పంపారు..

దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు! భక్తుడి వింత నిర్ణయం
Goddess Gets an IP Notice

Edited By:

Updated on: Oct 05, 2026 | 10:50 AM

తాడిపత్రి, అక్టోబర్ 5: అప్పులు ఎక్కువైతే వ్యక్తులు ఐపీ నోటీసులు పంపడం మనం చూస్తుంటాం.. కానీ, ఏకంగా దేవుడికే, అదీ ఓ అమ్మవారి ఆలయానికే ఐపీ నోటీస్ వస్తే ఎలా ఉంటుంది? వినడానికే కాస్త విడ్డూరంగా ఉన్నా.. ఈ వింత ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అనంతపురం జిల్లా యాడికి మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మండల కేంద్రానికి చెందిన మోహన్ అనే వ్యక్తి.. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికే ఏకంగా ఐపీ నోటీస్ పంపించాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు, భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

​సాధారణంగా ఆర్థిక లావాదేవీల్లో చిక్కులు వచ్చి, అప్పులు తీర్చలేకపోయినప్పుడు వ్యక్తులకు లేదా సంస్థలకు ఐపీ నోటీసులు వస్తుంటాయి. కానీ, మోహన్ అనే వ్యక్తి తనకు అప్పులు ఇచ్చిన వారి జాబితాలో చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయాన్ని కూడా చేర్చి నోటీస్ పంపడం చర్చనీయాంశంగా మారింది. మోహన్, ఆలయ కమిటీకీ సుమారు 3 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ అప్పుల వ్యవహారంలో భాగంగానే, తనకు అప్పులిచ్చిన మిగిలిన వారితో పాటు అమ్మవారి ఆలయానికి కూడా మోహన్ నోటీసులు పంపించాడు.

 

ఇవి కూడా చదవండి

56 మంది నుంచి రూ.1.65 కోట్ల అప్పులు

మోహన్‌ మొత్తం 56 మంది వద్ద నుంచి సుమారు రూ.1.65 కోట్ల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. చేసిన అప్పులను తీర్చే పరిస్థితి లేదని పేర్కొంటూ రుణదాతలందరికీ ఐపీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఆలయ కమిటీకి చెల్లించాల్సిన రూ.3 లక్షల బకాయికి సంబంధించి కూడా నోటీసు పంపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వ్యక్తిగత రుణదాతలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇలాంటి నోటీసులు పంపుతుంటారు. అయితే దేవత పేరుతో ఉన్న ఆలయ కమిటీకి కూడా ఐపీ నోటీసు పంపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం యాడికిలో చర్చనీయాంశంగా మారింది. మోహన్‌ తీసుకున్న అప్పులు, ఐపీ నోటీసుల వెనుక ఉన్న పూర్తి వివరాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అసలు ఆలయానికే ఐపీ నోటీస్ పంపాల్సిన అవసరం మోహన్‌కు ఎందుకు వచ్చింది? ఆ మూడు లక్షల రూపాయల బకాయిల వెనుక ఉన్న అసలు కధేంటి? ఆలయ కమిటీ సభ్యులు దీనిపై ఎలా స్పందిస్తారు? అనేది ప్రస్తుతం యాడికి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us