Telangana Elections: యాడ్స్, ఎస్‌ఎంఎస్‌లపై ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సాయంత్రానికి ఎండ్ కార్డ్ పడనుంది. బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిన తెలంగాణ ఇవాళ్టితో మూగబోనుంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జోరుగా ప్రచారం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు అన్ని జిల్లాలను చుట్టేస్తే.. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు సైతం ఉమ్మడి జిల్లాలన్నీ కవర్ అయ్యేలా ప్రచారం చేశారు.

Telangana Elections: యాడ్స్, ఎస్‌ఎంఎస్‌లపై ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే..
Telangana Polls 2023

Updated on: Nov 28, 2023 | 11:58 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సాయంత్రానికి ఎండ్ కార్డ్ పడనుంది. బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిన తెలంగాణ ఇవాళ్టితో మూగబోనుంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జోరుగా ప్రచారం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు అన్ని జిల్లాలను చుట్టేస్తే.. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు సైతం ఉమ్మడి జిల్లాలన్నీ కవర్ అయ్యేలా ప్రచారం చేశారు. ఈనెల 30న పోలింగ్ ఉండటంతో.. ఓటింగ్​కు 48 గంటల ముందే ప్రచారానికి ప్యాకప్ చెప్పనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో ప్రలోభాల పర్వం మొదలుకానుంది. దీంతో మద్యం, నగదు కట్టడికి చివరి రెండు రోజులు కీలకమని.. ప్రలోభాలను అరికట్టేందుకు పకడ్భందీగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన తెలంగాణ సీఈఓ వికాస్‌రాజ్‌.. పలు సూచనలు చేశారు.

119 నియోజకవర్గాలకుగాను 13 నియోజకవర్గాల్లో 30వ తేదీ పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకే ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం క్లోజ్ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు.. ఈ రెండ్రోజులు ప్రలోభాల కట్టడిపై నజర్ పెట్టి.. నిఘా మరింత పటిష్టం చేస్తారు.

మరోవైపు పోలింగ్ ఏర్పాట్లపై ఫోకస్ చేశారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించగా.. వారికి రేపు ఉదయం నుంచి ఈవీఎంలు.. ఇతర పోలింగ్ సామాగ్రి అందించనున్నారు. ఈవీఎంల పంపిణీ కేంద్రాల్లో.. మాక్ పోలింగ్ ద్వారా ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తారు ఎన్నికల అధికారులు.

ఎన్నికలకు 48 గంటల ముందే రాజకీయపరమైన యాడ్స్, ఎస్‌ఎంఎస్‌ల ప్రసారాలను ఎన్నికల కమిషన్‌ నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, సూచనలను ఉల్లంఘించేలా ఎస్‌ఎంఎస్‌లు పంపకూడదంటూ ఈసీ వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..