గోవాలో మూడు నెలలపాటు ఆపరేషన్ చేసి పట్టుకొచ్చిన నిందితుడు ఎడ్విన్ 10రోజుల్లో బయటకొచ్చాడు. చంచలగూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. గోవా డ్రగ్ డాన్.. మత్తు మాఫియా కింగ్‌పిన్ అని పోలీసులు చెప్పిన నిందితుడు 10 రోజుల్లోనే విడుదల కావడం చర్చనీయాంశమైంది. ఎడ్విన్‌కి బెయిల్ రాకుండా బలమైన ఆధారాల్ని కోర్టులో సమర్పించారు. అయినా బెయిల్ ఎలా వచ్చిందన్న విమర్శలు వినిపిస్తోంది. NDPS యాక్ట్ కింద ఎడ్విన్‌ను అరెస్టు చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడిపై పీడీ చట్టం ప్రయోగించడంతోపాటు గోవాలో అతlr ఆస్తుల్ని జప్తు చేయించే ప్రక్రియలో బిజీ అయ్యారు.
సాధారణంగా NDPS పీఎస్ చట్టం కింద జైలుకి వెళితే.. నెలల తరబడి కటకటాలకే పరిమితం కావాల్సిన పరిస్థితుల్లో ..మాదకద్రవ్యాల దందాలో ఆరితేరిన కీలక నేరస్థుడు విడుదలవ్వడం పోలీస్‌శాఖలో సంచలనం రేకెత్తించే అంశంగా మారిపోయింది. వాస్తవానికి ఎడ్విన్‌పై NDPS చట్టం కింద హైదరాబాద్‌లో రాంగోపాల్‌పేట, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటిల్లో రాంగోపాల్‌పేట కేసులో ఈనెల 5న అరెస్ట్ చేశారు. అయితే అంతకుముందే మిగిలిన రెండు కేసుల్లో ఎడ్విన్ ముందస్తు బెయిల్ సంపాదించాడు. ఈనేపథ్యంలోనే రాంగోపాల్‌పేట కేసులో ఎడ్విన్ చంచల్‌గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండగానే.. మిగిలిన రెండు కేసుల్లో ముందస్తు బెయిళ్లను రద్దు చేయించాలని హెచ్ న్యూ బృందం కసరత్తు చేసింది.
ఈ మూడు కేసుల ఆధారంగా ఎడ్విన్‌పై పీడీ చట్టం ప్రయోగించి ఏడాది పాటు కటకటాలకే పరిమితం చేయడం ద్వారా గోవా డ్రగ్ సర్కిల్‌లో వణుకు పుట్టించాలని భావించింది. కానీ ఎడ్విన్‌కు నాంపల్లిలోని మొదటి అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలన్న షరతు విధించింది. అనంతరం ఎడ్విన్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..