రాష్ట్రంలోని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ప్రముఖ ఎడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేసారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో, ఆలయ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసివేశారు అధికారులు. గురువారం ఆలయాన్ని మూసివేసి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో పూజలు చేశారు. కాగా ఈరోజు కూడా వరద ప్రవాహం ఉండడంతో కట్టెల సహాయంతో ఆలయంలోకి వెళ్లిన పూజారులు అమ్మవారికి పూజలు చేసి తిరిగి ఆలయాన్ని మూసివేశారు.
మంజీర నది ఉప్పొంగి ప్రవాహంగా వస్తు ఇక్కడికి రాగానే ఏడుపాయలుగా విడిపోయి ఆలయం మందుకు, చుట్టూ నీరు చేరుతాయి. దీంతో ఆలయం మొత్తం జల దిగ్బంధంలో ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున్న వస్తుంటారు. గత సంవత్సరం కూడా ఇలాగే వరద ప్రవాహం భారీగా రావడంతో అమ్మవారి ఆలయం సంగం వరకు మునిగి పోయింది.