MLA Rohith Reddy: ఇవాళ మరోసారి ఈడీ విచారణకు పైలట్‌ రోహిత్‌రెడ్డి.. సర్వత్రా ఉత్కంఠ..

ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మంగళవారం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకానున్నారు.

MLA Rohith Reddy: ఇవాళ మరోసారి ఈడీ విచారణకు పైలట్‌ రోహిత్‌రెడ్డి.. సర్వత్రా ఉత్కంఠ..
MLA Rohith Reddy

Updated on: Dec 20, 2022 | 7:29 AM

ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మంగళవారం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకానున్నారు. నిన్న రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు 6 గంటలపాటు విచారించారు. నిన్న తన వ్యక్తిగత వివరాలు, వ్యాపార లావాదేవీలపై అడిగారని చెప్పుకొచ్చారు రోహిత్‌రెడ్డి. దీంతో ఈడీ అధికారులు ఇవాళ ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి విచారణలో ఈడీకి పూర్తిగా సహకరించానన్నారు రోహిత్‌ రెడ్డి. ఇవాళ కూడా ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని వెల్లడించారు. నిన్నటి విచారణ అనంతరం ఈ రోజు 10.30 గంటలకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

కాగా, సోమవారం విఙ్ఞప్తులు.. తిరస్కరణ మధ్య ఈడీ తన పంతాన్ని నెగ్గించుకుంది. ఎలాంటి వాయిదా లేకుండా రావాల్సిందేనన్న ఈడీ ఆదేశాలను గౌరవించారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి. మధ్యాహ్నం 3.21 నిమిషాలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు. దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది.

ఈనెల 16న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. 19న హాజరుకావాలని సూచించింది. వచ్చే ముందు ఆధార్‌, ఓటర్ ఐడీతో ఇతర డాక్యుమెంట్లతో రావాలని సూచించిందన్నారు రోహిత్ రెడ్డి. న్యాయనిపుణులతో చర్చించి.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని హాజరవుతానని ప్రకటించారాయన. అయితే ఇవాళ ఉదయం 9.40 ని.లకు మణికొండలోని తన నివాసం నుంచి ఈడీ ఆఫీస్‌కు బయలుదేరిన రోహిత్‌ సడెన్‌గా ప్రగతి భవన్‌ వెళ్లారు. ఆ తర్వాత ఈనెల 31న హాజరవుతానని తన పీఏతో ఈడీకి లేఖ పంపించారు. విఙ్ఞప్తిని అధికారులు తిరస్కరించడంతో ఈడీ ఎదుట హాజరయ్యారు రోహిత్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..