Telangana: తెలంగాణలో ఈడీ మెరుపు దాడులు.. మంత్రి గంగుల కమలాకర్ బంధువుల ఇళ్లలో సోదాలు

తెలంగాణలోని పలువురు గ్రానైట్ వ్యాపారుల నివాసాల్లో ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు సాగుతున్నాయి.

Telangana: తెలంగాణలో ఈడీ మెరుపు దాడులు.. మంత్రి గంగుల కమలాకర్ బంధువుల ఇళ్లలో సోదాలు
IT And ED Raids On TS Minister Gangula Kamalakar
Follow us

|

Updated on: Nov 09, 2022 | 1:41 PM

తెలంగాణలో మెరుపు దాడులతో దడ పుట్టిస్తోంది ఈడీ. మంత్రి గంగుల కమలాకర్‌, ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఐటీ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. దాదాపు 20 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. మైనింగ్ అక్రమాలపై కేసు నమోదు చేసిన ఈడీ.. కరీంనగర్‌, హైదరాబాద్‌లో సోదాలు చేస్తోంది. గతంలో ఈడీ నోటీసులు జారీ చేసిన కంపెనీల్లో దాడులు జరుగుతున్నాయి. శ్వేతా ఏజెన్సీ, AS UY షిప్పింగ్, JM బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్‌, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజెన్సీస్, PSR ఏజెన్సీస్, KVA ఎనర్జీ, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ సంస్థలు మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందాయి. అయితే ఫెమా నిబంధనలకు విరుద్దంగా పరిధికి మించి ఈ సంస్థలు తవ్వకాలు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈడీ మెరుపు దాడులు చేసింది.

కరీంనగర్‌లోని మంకమ్మతోట, కమాన్ చౌరస్తా, బావుపేట ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపారులు గంగధరరావు, అరవింద వ్యాస్‌ల ఇళ్లల్లో పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని గతంలోనూ వీళ్లిద్దరిపై ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది.

మంత్రి గంగుల కమలాకర్‌, ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లల్లో.. మొత్తం 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే విదేశాలకు గ్రానైట్ ఎగుమతులపైనా ఈడీ ఆరాతీస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..