Raja singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ షాక్‌.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశం..

|

Feb 19, 2022 | 8:56 PM

యూపీ ఎన్నికల్లో ఓటర్లను భయపెట్టారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు  సీరియస్ అయింది.

Raja singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ షాక్‌.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశం..
BJP MLA Raja singh
Follow us on

యూపీ ఎన్నికల్లో ఓటర్లను భయపెట్టారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు  సీరియస్ అయింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 72 గంటల పాటు ర్యాలీలు , బహిరంగసభల్లో పాల్గొనవద్దని , మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని కూడా ఈసీ రాజాసింగ్‌ను ఆదేశించింది. కాగా యూపీలో యోగికి ఓటెయ్యని వాళ్లను శిక్షించేందుకు బుల్‌డోజర్లు సిద్ధంగా ఉన్నాయని గోషామహల్‌ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. కేంద్రం ఎన్నికల సంఘం కూడా ఈ వ్యాఖ్యలపై సీరియస్‌ అయ్యింది.

ఈ క్రమంలో యూపీ ఓటర్లను బెదిరించారంటూ రాజా సింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఐపీసీ, ఆర్‌పీ చట్టం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది. కాగా తామిచ్చిన షోకాజ్‌ నోటీసులకు గడువు లోగా సమాధానం ఇవ్వకపోవడంతోనే తాజా చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Also Read:Viral Photo: కురులతో ముఖాన్ని దాచేసిన ఈ కుందనపు బొమ్మ ఎవరో గుర్తు పట్టారా.?

దోషిగా తేలితే ఆ ప్లేయర్‌ IPL కాంట్రాక్ట్ రద్దవుతుందా.. క్రికెట్‌ ఆడకుండా నిషేధిస్తారా..?

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..