Telangana: ఈ పండుగ వేళ అదృష్టం బాగుంటే ఇంటికి మేకపోతు.. లేదంటే నాటుకోడి.. ఎలాగంటే?

| Edited By: Balaraju Goud

Oct 07, 2024 | 12:48 PM

మీరు బ్యాగ్ పట్టుకుని దసరా పండు షాపింగ్‌కు వెళ్తున్నారా? మీకు ఈ ఆఫర్‌ గురించి తెలుసా? లేదంటే మీరు మిస్ అవుతారు. దసరా నవరాత్రులు సందర్భంగా వాడ వాడలా సందడి నెలకొంది.

Telangana: ఈ పండుగ వేళ అదృష్టం బాగుంటే ఇంటికి మేకపోతు.. లేదంటే నాటుకోడి.. ఎలాగంటే?
Dasera Offer
Follow us on

మీరు బ్యాగ్ పట్టుకుని దసరా పండు షాపింగ్‌కు వెళ్తున్నారా? మీకు ఈ ఆఫర్‌ గురించి తెలుసా? లేదంటే మీరు మిస్ అవుతారు. దసరా నవరాత్రులు సందర్భంగా వాడ వాడలా సందడి నెలకొంది. అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి, నవరాత్రులు రోజుకో అలంకారంతో పూజలు చేస్తారు. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామాంజనేయ కాలనీ యువకులు ఈసారి దసరా పండుగను వైరైటీగా జరుపుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

దేవీ నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా రామాంజనేయ కాలనీ యువకులు ఒక కొత్త లక్కీ కూపన్ డిప్‌ను ఏర్పాటు చేశారు.ఈ లక్కీ కూపన్ 100 రూపాయలకు కొనుగోలు చేయాలి. అక్టోబర్ 11వ తేదీన కొత్తగూడెం క్లబ్‌లో నియోజకవర్గ ఎమ్మెల్యే కూనoనేని సాంబశివ రావు ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీస్తారు. ఇందులో వినూత్నంగా బహుమతులు అందజేయాలని నిర్ణయించారు.

లక్కీ డ్రా లో తీసిన మొదటి బహుమతి గా మేకపోతు, రెండవ బహుమతి పట్టుచీర, మూడో బహుమతిగా రెండు మద్యం బాటిల్స్, నాల్గోవ బహుమతిగా లంగా ఓణీ, ఐదోవ బహుమతి నాటుకోడి ప్రకటించారు. లక్కీ దీప్ కార్యక్రమాన్ని కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు యువకులు. దీనితో స్థానికులు తెగ ఆసక్తి చూపుతూ కొనుగోలు చేస్తున్నారు. ఈ పండుగ వేళ అదృష్టం బాగుంటే మేకపోతు రావచ్చు. నాటుకోడి రావచ్చు. ఏదో ఒకటి వస్తుందనే ఆశతో కొనుగోలు చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..