Telangana: 21వ శతాబ్దంలో కూడా మనిషి మూఢాచారాలను నమ్ముతున్నారు. మానవత్వాన్ని మరచి దారుణాలకు పాల్పడుతున్నారు. రోజురో దారుణ ఘటన వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. సర్వ సాధారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు మూఢ నమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తారు. దేవుళ్లకు బలి ఇవ్వడం, రకరకాల పూజలు చేస్తుంటారు. తాజాగా అమ్మవారి పూజలో వింత ఆచారం పేరుతో పశువులను బలి ఇచ్చి దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో (mahabubabad District) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం జెండాల తండాలో వింత ఆచారం ఉంది. ఈ తండా గ్రామంలో కాళీ మాత పూజలను తండావాసులు అత్యంత ఘనంగా నిర్వహించారు. పూజల అనంతరం అత్యంత భయంకరంగా 20 దున్నలను అమ్మవారికి బలి ఇచ్చారు. ఈ సమయంలో ఆ తండాకు చెందిన కొందరు యువకులు ఈ జంతుబలి దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇలా అత్యంత పాశవికంగా జంతు బలులు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ విషయం జిల్లా కలెక్టర్, SPలకు దృష్టికి చేరుకుంది. అధికారులు చర్యలు ప్రారంభించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు జెండా తండాకు వెళ్ళి కౌన్సెలింగ్ చేశారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని చైతన్య పరిచారు. అంతేకాదు అధికారులు పూజకు బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని దున్నలను తొర్రూర్ లోని గోశాల కి తరలించారు.
Also Read: Crime News: 24 గంటలూ ఫోన్‌తోనే.. తండ్రి రీఛార్జ్ చేయించలేదని కన్న కొడుకు ఏం చేశాడంటే..?
Moral in Ramayana: భర్త మరణంలోనూ ధర్మం మాట్లాడిన పతివ్రత మండోదరి.. రావణుడి మరణం గురించి ఏమన్నదంటే