Telangana: ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే.. చుక్కలు చూడాల్సిందే..

జహీరాబాద్‌ శివారులో ఉన్న ఈ రోడ్డు పై నుండే అంతరాష్ట్ర రాకపోకలు సాగుతాయి. అలాంటి రోడ్డు గుంతలుగా మారి నరకం చూపిస్తోంది. ఈ రోడ్డు పై వెళ్లి బస్సులు సర్కాస్ ఫీట్లు వేసేలా ఉన్నాయి ఇక్కడ గుంతలు. ఈ రోడ్డు పై ప్రయాణం అంటేనే వాహనదారులు,ప్రయాణికులు వణికిపోతున్నారు...కానీ గత్యంతరం లేక తిట్టుకుంటూ...

Telangana: ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే.. చుక్కలు చూడాల్సిందే..
Road
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Sep 30, 2024 | 5:02 PM

ఆ రోడ్డు సరిగ్గా ఉంటే ప్రయాణ సమయం కేవలం 5నుంచి 10 నిమిషాలు…కానీ ప్రస్తుతం ఆ రోడ్డు దాటుకుని పోవాలంటే మినిమం 40 నిమిషాలు పడుతుంది..అది కూడా అతి కష్టంగా..ఇక ఆ రోడ్డు పై గర్భిణులు,ముసలి వాళ్ళు పోవాలంటే వణికిపోతారు.. దీనికి తోడు ఆ సమయంలో రైలు వస్తే ఇక అంతే సంగతులు..ఇది జహీరాబాద్‌ వాసుల కష్టాలు.

జహీరాబాద్‌ శివారులో ఉన్న ఈ రోడ్డు పై నుండే అంతరాష్ట్ర రాకపోకలు సాగుతాయి. అలాంటి రోడ్డు గుంతలుగా మారి నరకం చూపిస్తోంది. ఈ రోడ్డు పై వెళ్లి బస్సులు సర్కాస్ ఫీట్లు వేసేలా ఉన్నాయి ఇక్కడ గుంతలు. ఈ రోడ్డు పై ప్రయాణం అంటేనే వాహనదారులు,ప్రయాణికులు వణికిపోతున్నారు…కానీ గత్యంతరం లేక తిట్టుకుంటూ, కోపంగా ప్రయసలు పడుతూ రోడ్డు పై వెళ్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులతో పాటు, ఇతర రాష్ట్రాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

జహీరాబాద్‌ పట్టణంలోని రైల్వేగేటు వద్ద రూ.90 కోట్లతో రెండు వరుసలతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులకు 2018 ఆగస్టు 30న ఎంపీ బీబీ పాటిల్‌, అప్పటి ఎమ్మెల్సీ మహ్మద్‌ పరీదుద్దీన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌-పర్లివైజ్యనాథ్‌ రైలు మార్గం జహీరాబాద్‌ పట్టణం మీదుగా వెళుతుంది. సికింద్రాబాద్‌, నాందేడ్‌, పూర్ణ, షిర్డీ, బెంగుళూరు, తిరుపతి, కాకినాడ రైళ్లు రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతిసారి గేటు పడటంతో వాహనదారులకు కష్టాలు తప్పడంలేదు.

జహీరాబాద్‌ ప్రధాన రహదారిపై రైల్వేగేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నప్పటికీ ముగింపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనులు ప్రారంభించి ఐదేళ్లవుతున్నా గుత్తేదారులు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఉపరితల వారధి అందుబాటులోకి రావడం లేదు. సుమారు కిలోమీటరు పొడువున నిర్మిస్తున్న వంతెన అసంపూర్తి పనుల వల్ల ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు పై వెళ్తున్న వాహనాలు గుంతల్లో పడి దెబ్బతింటు న్నాయి.

ముఖ్యంగా జహీరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లే బస్సులు ఇలానే వెళ్ళాలి. ఈ రోడ్డు పైకి ఊగుతూ ఊగుతూ పోతున్నాయి..ఇక నిత్యం జనలను తీసుకెళ్లే ఆటోల పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారనే ఆరోపణ లున్నాయి. ఈ రోడ్డు పై ఉన్న గుంతల్లో పడి వాహన దారులకు పలు మార్లు రో‌డ్డు ప్రమాదాలు జరిగినట్లు చెబుతున్నారు. గుత్తేదారులు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో కొన్నాళ్లుగా పనులు నెమ్మదించాయి. నిర్మాణ పనులు తుది దశలో ఉన్న సమయంలో బిల్లుల చెల్లింపులు సరిగ్గా చేయకపోవడంతో పనులను నిలిపివేశారు.

ఇరువైపులా రోడ్డు అనుసంధానం చేసి వంతెన రెయిలింగ్‌ పూర్తి చేసి రంగులు వేస్తే ప్రారంభానికి సిద్ధమవుతుంది. మళ్లీ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.నాలుగు వరుసల ఉపరితన వంతెన నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులభం కానున్నాయి. జహీరాబాద్‌ పట్టణం మీదుగా అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే చించోళి, గుల్బర్గా, బసవకళ్యాణ్‌, బీదర్‌, ప్రయాణికులకు సౌకర్యంగా మారనుంది. పట్టణ శివారులోని డ్రీమ్‌ ఇండియా, బందేఆలీ, బాబూమోహన్‌ కాలనీలతో పాటు మహీంద్రా, ఎంజీ, ముంగి, బూచినెల్లి పారిశ్రామిక వాడలు సహా మెుగుడంపల్లి, జహీరాబాద్‌ మండలంలోని పలు గ్రామాలకు ప్రజలకు ఈ పాడైన రోడ్డు పై వెళ్లే ఇబ్బందులతో పాటు, ఇక్కడ రైల్వే గేటు పడ్డప్పుడు వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలు పూర్తిగా తీరనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే.. చుక్కలు చూడాల్సిందే..
ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే.. చుక్కలు చూడాల్సిందే..
రాజస్థాన్‌లోని ఈ ప్రదేశాన్ని రూ. 2 వేలకే సందర్శించవచ్చు..
రాజస్థాన్‌లోని ఈ ప్రదేశాన్ని రూ. 2 వేలకే సందర్శించవచ్చు..
ఈ వారం ఓటీటీలో 25కు పైగా సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
ఈ వారం ఓటీటీలో 25కు పైగా సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
ఈ జనరేషన్‌కు ఇద్దరు హీరోయిన్స్‌ దొరికేశారు..
ఈ జనరేషన్‌కు ఇద్దరు హీరోయిన్స్‌ దొరికేశారు..
రైల్వే శాఖలో 14,298 పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మళ్లీ ఛాన్స్
రైల్వే శాఖలో 14,298 పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మళ్లీ ఛాన్స్
ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గోవు రాజ్యమాతగా ప్రకటన..
ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గోవు రాజ్యమాతగా ప్రకటన..
భోజనానికి ముందు నిమ్మరసం తాగితే.. ఏమవుతుంతో తెలుసా.?
భోజనానికి ముందు నిమ్మరసం తాగితే.. ఏమవుతుంతో తెలుసా.?
టీమిండియాలో 'గజిని' ఎవరు..? రోహిత్ ఆన్సర్ తెలిస్తే నవ్వాల్సిందే
టీమిండియాలో 'గజిని' ఎవరు..? రోహిత్ ఆన్సర్ తెలిస్తే నవ్వాల్సిందే
‘దేవ‌ర‌’తో హిస్ట‌రీ క్రియేట్ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌..
‘దేవ‌ర‌’తో హిస్ట‌రీ క్రియేట్ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌..
మీకు చెమటలు ఎక్కువగా పడుతున్నాయా.. ఈ వ్యాధి కావచ్చు!
మీకు చెమటలు ఎక్కువగా పడుతున్నాయా.. ఈ వ్యాధి కావచ్చు!
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!
బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!