Hyderabad: అతిపెద్ద జాతీయ జెండా అవనతం .. అందుకేనని అధికారుల వివరణ

|

Jul 12, 2022 | 12:48 PM

దేశంలో అతిపెద్ద జాతీయ జెండాను అధికారులు తాత్కాలికంగా కిందకు దించారు. జాతీయ జెండాకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు HMDA అధికారులు తెలిపారు

Hyderabad: అతిపెద్ద జాతీయ జెండా అవనతం .. అందుకేనని అధికారుల వివరణ
National Flag In Sanjeevaia
Follow us on

National Flag: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలోని సంజీవయ్య పార్కులో దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండా ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ అతిపెద్ద జాతీయ జెండాను అధికారులు తాత్కాలికంగా అవనతం చేశారు. జాతీయ జెండాకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకటించారు. ఈ జెండా హుస్సేన్ సాగర్‌కు అతి సమీపంలో ఉండటంతో తరచూ వీచే అతి బలమైన గాలులకు  చిరిగిపోవడం అధికారులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సంజీవయ్య పార్క్ లో 291 అడుగుల ఎత్తులు జాతీయ జెండా ఎగురుతుంది. ఈ జెండాను అధికారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇప్పటికే అయితే ఇప్పటికే మూడు జెండాలు చిరిగిపోగా.. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి.. మళ్ళీ మళ్ళీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనదేశంలో జాతీయ జెండా వాడుకలో కూడా కొన్ని నియమాలున్నాయి. జెండాను ఎగురవేయడం, ఇతర జాతీయ, సాధారణ జెండాలతో కలిపి భారత జాతీయ పతాకాన్ని వాడేప్పుడు అనుసరించాల్సిన విధానాలకు ఆ కోడ్ వర్తిస్తుంది.

చిరిగిన జెండాను పోల్‌పై ఉంచడం మన దేశంలో నేరం. అంతేకాదు జెండా చిరగడం కూడా నేరంగా పరిగణిస్తారు. అయితే గాలుల ప్రభావంతో జెండా చిరిగితే మాన్యుమెంట్ ఫ్లాగ్ కేటగిరీకి వస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..