Nizamabad: ‘అమ్మా’నుషం.. ఇద్దరు పిల్లలను వాగులో పడేసిన తల్లి.. బయటకు తీసే లోపే..

భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. అసలు గొడవలే లేని దంపతులూ ఎవరూ లేరు. కానీ.. వాటికీ ఓ పరిధి ఉంటుంది. దాంపత్య జీవితంలో ఎవరో ఒకరు తగ్గాలి. లేదా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒకరి...

Nizamabad: 'అమ్మా'నుషం.. ఇద్దరు పిల్లలను వాగులో పడేసిన తల్లి.. బయటకు తీసే లోపే..
Mother Kills Babies
Follow us

|

Updated on: Dec 27, 2022 | 11:09 AM

భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. అసలు గొడవలే లేని దంపతులూ ఎవరూ లేరు. కానీ.. వాటికీ ఓ పరిధి ఉంటుంది. దాంపత్య జీవితంలో ఎవరో ఒకరు తగ్గాలి. లేదా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వాలి. లేకుంటే ఆ కాపురం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. వారికి చిన్నారులుంటే వారి పరిస్థితి మరితం దయనీయంగా మార్చేస్తుంది. నిజామాబాద్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆ ప్రాణాలు తీసేసింది.. కూడా ప్రాణాలు ఇచ్చిన అమ్మే కావడం గమనార్హం. పేగు బంధం అనే కనికరం లేకుండా తన కబంధ హస్తాలతో చిన్నారులిద్దరినీ వాగులో పడేసింది ఆ కర్కశ తల్లి.. ఎందుకు చేశావంటే.. తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని, వారి నుంచి కాపాడుకునేందుకు పిల్లలిద్దరినీ వాగులో పడేసినట్లు చెప్పడం సిగ్గుచేటు.

నిజామాబాద్‌ జిల్లా నాగారం చక్రనగర్‌ తండాకు చెందిన అరుణకు.. మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు చెందిన మోహన్‌ తో పెళ్లయింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త పెట్టే ఇబ్బందులు తాళలేక అరుణ పుట్టింటికి వచ్చింది. రోజులు గడుస్తున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త మోహన్ ఫోన్ చేశాడు. ఉద్గీర్‌ వచ్చేయాలని కోరాడు. దీంతో ఆమె భర్త వద్దకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చక్రనగర్ తండా నుంచి బయలుదేరింది. దారిలో బాన్సువాడ శివారులో ఉన్న వాగు వద్దకు వెళ్లింది. చిన్నారులిద్దరినీ అందులో పడేసింది. ఘటనను చూసిన స్థానికులు.. వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారులను బయటకు తీశారు. చికిత్స అందించేందుకు వారిని ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు నిర్ధరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశారు.

నిజామాబాద్‌ నుంచి ఆటోలో వస్తుండగా డ్రైవర్‌ తనపై అఘాయిత్యం చేయడంతో పిల్లలను వాగులో పడేసినట్లు అరుణ వారికి తెలిపింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా.. వాగు వద్ద ఆటో కానీ, డ్రైవర్‌ కానీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాల కోసం వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం