Jagtial: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసం ఆపగా.. పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మందుబాబు

|

Jan 01, 2022 | 3:14 PM

జగిత్యాలలో నూతన సంవత్సర బందోబస్తు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ లకు ఒక అనుకోని అనుభవం ఎదురైంది. శుక్రవారం రాత్రి నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో...

Jagtial: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసం ఆపగా.. పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మందుబాబు
Drunken Man
Follow us on

జగిత్యాలలో నూతన సంవత్సర బందోబస్తు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ లకు ఒక అనుకోని అనుభవం ఎదురైంది. శుక్రవారం రాత్రి నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాలు అర్ధరాత్రి వరకు సాగాయి. ఈ క్రమంలో పూటుగా మద్యం సేవించి వస్తున్న ఓ ద్విచక్ర వాహన దారుడిని ఆపారు పోలీసులు. సదరు వ్యక్తికి బ్రీత్ ఎనలైజర్ చేశారు ఎస్‌ఐ నవత. ఆ మందుబాబు ఊదగానే ఏకంగా 164 వరకు రీడింగ్ వచ్చింది. దీంతో ఎస్.ఐ నవతతో వాగ్వివాదానికి దిగాడు సదరు మందుబాబు. ప్రభుత్వం రాత్రి 1 గంటలవరకు పబ్బులకు, రెస్టారెంట్లకు అనుమతులు ఇచ్చింది కాబట్టే తాను మద్యం తాగానని…. ఇప్పుడు ఇలా బ్రీత్ ఎనలైజర్ చేయడం ఏంటి??? అంటూ గొడవకు దిగాడు. అతని వివరాలు సేకరించిన పోలీసులు మందుబాబుపై కేసు నమోదు చేసి బైక్‌ేను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాస్త ఇంటి పట్టునే ఉండి సంబరాలు చేసుకోమంటే తాగి రోడ్లపైకి వచ్చి మళ్ళీ విధుల్లో ఉన్న తమను ఇబ్బంది పెట్టడం ఏంటని వాపోతున్నారు పోలీసులు.

తాగడమంటే… మామూలు తాగడం కాదది… డ్రింకింగ్‌ లో ఎప్పటికీ వాళ్లే కింగ్స్‌. తాగాలన్నా మేమే.. తాగి కొత్త రికార్డులు సృష్టించాలన్నా మేమే.. అంతేకాదు.. ఆ రికార్డులను తిరగరాయాలన్నా మేమే.. అన్నట్టుగా రెచ్చిపోయారు మందుబాబులు. అందుకే.. జస్ట్‌ మందు.. ఆ తర్వాత చిందు… హైదరాబాద్‌ టు బెజవాడ… న్యూ ఇయర్‌ సందర్భంగా ఎటు చూసినా ఇదే సీన్‌ కనిపించింది. ఫలితంగా.. మద్యం ఏరులై పారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు నువ్వా నేనా అన్నట్టు… మద్యం అమ్మకాల్లో పోటీ పడ్డాయి. సీసాలకు సీసాలు తాగేసిన మందు బాబులు… ప్రభుత్వాలకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టి.. తమ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చారు. ఒక్కటంటే ఒక్కరోజులో… లక్షల కేసుల బీర్లు, లక్షల కేసుల లిక్కర్‌ బాటిళ్లను ఖాళీచేశారంటే … కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యం ఏ రేంజ్‌లో ఏరులై పారిందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో డిసెంబర్ 31 ఒక్కరోజే 171.93 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్‌ మొత్తంగా చూస్తే.. 1వ తేదీ నుంచి థర్టీ ఫస్ట్‌ వరకు.. లిక్కర్‌ సేల్స్‌ ద్వారా 3వేల 459 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ డిసెంబర్‌లో మొత్తం 40.48లక్షల లిక్కర్‌ కేసులు, 34లక్షల బీర్‌ కేసులు అమ్ముడయ్యాయి. గతేడాది డిసెంబర్‌లో 2వేల 764 కోట్ల మద్యం అమ్మకాలు మాత్రమే జరిగాయి. పోయినేడాది కంటే 700 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం సమకూరడం విశేషం.

Also Read: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెడితే మీ చూపుల్లో పదునున్నట్లే…