Telangana: మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై ప్రత్యేక దృష్టి..

|

May 18, 2024 | 6:19 AM

వరుస తనిఖీలతో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు హడలెత్తిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అనుమతుల్లేని క్లినిక్‌లు, మెడికల్‌ షాపులను గుర్తించి సీజ్ చేశారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అనుమతుల్లేని మెడికల్​ షాపులు, క్లినిక్‌లపై కొన్నాళ్లుగా ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. అధికారులు ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా..

Telangana: మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై ప్రత్యేక దృష్టి..
Telangana
Follow us on

వరుస తనిఖీలతో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు హడలెత్తిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అనుమతుల్లేని క్లినిక్‌లు, మెడికల్‌ షాపులను గుర్తించి సీజ్ చేశారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అనుమతుల్లేని మెడికల్​ షాపులు, క్లినిక్‌లపై కొన్నాళ్లుగా ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. అధికారులు ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా.. నకిలీ మందులు, గుర్తింపు లేని మెడికల్‌ షాపుల వ్యవహారం తెరపైకి వస్తూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఘట్ కేసర్, నర్సంపేట, గోదావరిఖని, జడ్చర్ల, మెదక్‌లో డ్రగ్‌ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని సంపూర్ణ ఆయుర్వేద నిలయంపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. డయాబెటిస్‌కు ఆయుర్వేద ఔషధంగా అల్లోపతి డ్రగ్ పౌడర్ మిక్స్‌ను అమ్ముతున్న రాకెట్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు ఛేదించారు. ఆయుర్వేద మందులుగా చెప్పబడుతున్న మెట్‌ఫార్మిన్, గ్లిమెపిరైడ్, గ్లిక్లాజైడ్ లాంటి లక్షన్నర విలువైన అల్లోపతి యాంటీ డయాబెటిక్ మందులను అధికారులు సీజ్ చేశారు.

వరంగల్ జిల్లా నర్సంపేటలో జెన్ బాక్ట్ ఆయింట్మెంట్తో పాటుగా గోదావరిఖనిలో తేమెన్ ఇంజక్షన్స్‌ను MRP కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్న మెడికల్ షాప్‌లను అధికారులు సీజ్ చేశారు. జడ్చర్లలో తప్పుదోవ పట్టించే ప్రకటనలతో అమ్ముతున్న ఆయుర్వేద ఔషధం ఫెమిజోయ్ సిరప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట్ గ్రామంలోని ఆర్ఎంపీ పద్మావతి క్వాక్ క్లినిక్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. 70వేల రూపాయల విలువైన 40రకాల మెడిసిన్స్‌ను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇక.. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా క్లినిక్, మెడికల్ దుకాణాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు హెచ్చరించారు. అనుమతుల్లేకుండా క్లినిక్​, మెడికల్​ దుకాణాలు నడిపితే ఇప్పటికైనా మూసివేయాలని.. తనిఖీల్లో దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తంగా.. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మెడికల్‌ షాపులపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..