AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..

జనగామ జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పసికందు కిడ్నాప్ కలకలం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంక్యుబేటర్ల వార్డులో చికిత్స పొందుతున్న పసికందును ఓ మాయలేడి కిడ్నాప్ చేసింది. బాలింతలా నటించి ఆ పసికందుకు పాలిస్తానని నమ్మించి.. కొంగులో చుట్టుకుని అపహరించింది.

ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..
anagama child abduction
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 9:41 AM

Share

జనగామ జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పసికందు కిడ్నాప్ కలకలం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంక్యుబేటర్ల వార్డులో చికిత్స పొందుతున్న పసికందును ఓ మాయలేడి కిడ్నాప్ చేసింది. బాలింతలా నటించి ఆ పసికందుకు పాలిస్తానని నమ్మించి అపహరించింది. పసికందును తన కొంగులో చుట్టుకొని పారిపోతున్న క్రమంలో కుటుంబ సభ్యులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.. ఆటోలో వెళుతున్న ఆమెను వెంబడించి క్యాచ్ చేశారు. ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఈ కిడ్నాప్ సంఘటన జనగామ జిల్లా చంపక్ హిల్స్ ప్రాంతంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరిగింది.. ఆస్పత్రి ఆవరణలో తిష్టవేసిన ఓ మాయలేడి పసిపిల్లల ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఆ పసికందు కుటుంబ సభ్యుల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇంక్యుబేటర్ వార్డులో మగ శిశువు చికిత్స పొందుతున్నాడు. రాత్రి ఆ శిశువు ఏడుస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఓ మహిళ బాలింతలా నటించింది. తన బిడ్డే అని పాలిస్తానని నమ్మించింది. ఆ పసికందుకు పాలిస్తున్నట్లు నటించి తన కొంగులో చుట్టుకొని పారిపోయింది.

ఈ క్రమంలో అక్కడే ఉన్న పసికందు కుటుంబసభ్యులు వార్డులోపలికి వెళ్లి వాళ్ల శిశువు లేదని గుర్తించారు.. వెంటనే అప్రమత్తమై ఆ మహిళను వెంబడించారు. ఆటోలో వెళ్తున్న మహిళను వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు.

ఆ మహిళను అదే ఆటోలో తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చారు.. కిడ్నాపైన పసికందును స్వాధీనం చేసుకుని ఆ మాయలేడికి దేహశుద్ధి చేశారు.. అడ్డువచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు.

పసికందును ఆటోలో తరలిస్తుండగా అచ్చం సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ మహిళను అప్పగించారు.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ యత్నించిన మహిళ రఘునాథపల్లి మండలానికి చెందిన జ్యోతిగా గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే