Telangana: ఆపరేషన్‌ జరిగిన ఆరేళ్లకు కడునొప్పి.. ఎక్స్‌రే తీసి చూడగా షాకింగ్‌ దృశ్యం.

ఎంతో బాధ్యాతాయుతంగా ఉండాల్సిన వైద్యులు కొన్ని సందర్భాల్లో చేసే తప్పులకు రోగులు బలి అవుతుంటారు. అవగాహన రాహిత్యమో, నిర్లక్ష్యమో కానీ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. ఆపరేషన్స్‌ చేసే సమయంలో వైద్యుల నిర్లక్ష్యం తాలుకూ వార్తలు అడపాదడపా చూసే ఉంటాం...

Telangana: ఆపరేషన్‌ జరిగిన ఆరేళ్లకు కడునొప్పి.. ఎక్స్‌రే తీసి చూడగా షాకింగ్‌ దృశ్యం.
Representative Image

Updated on: Feb 26, 2023 | 7:40 AM

ఎంతో బాధ్యాతాయుతంగా ఉండాల్సిన వైద్యులు కొన్ని సందర్భాల్లో చేసే తప్పులకు రోగులు బలి అవుతుంటారు. అవగాహన రాహిత్యమో, నిర్లక్ష్యమో కానీ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. ఆపరేషన్స్‌ చేసే సమయంలో వైద్యుల నిర్లక్ష్యం తాలుకూ వార్తలు అడపాదడపా చూసే ఉంటాం. తాజాగా ఇలాంటి ఓ దారుణ సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. 2017లో ఆపరేషన్‌ జరిగిన ఓ మహిళ ఇటీవల కడుపునొప్పితో బాధపడింది.

దీంతో స్కానింగ్‌ చేయగా షాకింగ్‌ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లాలకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం 2017లో గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్‌ చేసిన వైద్యులు పొట్టలో కత్తెరను మరిచిపోయారు. దీంతో గత కొన్నేళ్లుగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతోంది. ఏళ్లు గడుస్తోన్నా నొప్పి తగ్గడకపోవడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిందామో. దీంతో స్కానింగ్ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. ఈ దృశ్యం చూసిన వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆమెకు గతంలో ఆపరేషన్‌ చేసిన వైద్యుడుని నిలదీయడంతో ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు భరిస్తానంటూ బేరానికి దిగాడు. ప్రస్తుతం ఎక్స్‌రేకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..