Doctors Fight: పరీక్ష హాల్లో వైద్యుల పోట్లాట.. షాక్ తిన్న విద్యార్ధులు.. ప్రిన్సిపాల్ జోక్యంతో ఏం జరిగిందంటే..

|

Apr 27, 2021 | 5:17 PM

అక్కడ కాబోయే డాక్టర్లకు పరీక్ష జరగబోతోంది. పరీక్ష రాయడానికి వచ్చిన వారికి తమకు పరీక్ష నిర్వహించేది ఎవరో అర్ధం కాలేదు. ఎందుకంటే.. అక్కడ ఇద్దరు డాక్టర్లు నేనంటే నేనంటూ వాదులాడుకుంటున్నారు.

Doctors Fight: పరీక్ష హాల్లో వైద్యుల పోట్లాట.. షాక్ తిన్న విద్యార్ధులు.. ప్రిన్సిపాల్ జోక్యంతో ఏం జరిగిందంటే..
Doctors Fight
Follow us on

Doctors Fight: అక్కడ కాబోయే డాక్టర్లకు పరీక్ష జరగబోతోంది. పరీక్ష రాయడానికి వచ్చిన వారికి తమకు పరీక్ష నిర్వహించేది ఎవరో అర్ధం కాలేదు. ఎందుకంటే.. అక్కడ ఇద్దరు డాక్టర్లు నేనంటే నేనంటూ వాదులాడుకుంటున్నారు. దీంతో ఖంగుతిన్న విద్యార్ధులు ఇదెక్కడి గోలరా బాబూ అని తలలు పట్టుకున్నారు. ఆఖరుకు పెద్ద ప్రొఫెసర్లు వచ్చి ఇద్దరు డాక్టర్లను సముదాయించి పరీక్ష సజావుగా సాగేలా చేశారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది.

గాంధీ మెడికల్‌ కాలేజీలోని ఆర్ధోపెడిక్‌ విభాగంలో ఇద్దరు డాక్టర్లు విద్యార్ధుల సమక్షంలో ఫైట్ కి దిగారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ పార్ట్‌–2 ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. మే 3వ తేదీన ముగుస్తాయి. అయితే, ఈ పరీక్షల్లో ఆర్ధోపెడిక్‌ విభాగం ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌గా ప్రొఫెసర్‌ ఎన్‌.రవీందర్‌కుమార్‌ను నియమిస్తూ ఈనెల 24వ తేదీన కేఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌ ఎగ్జామినేషన్‌ డిప్యూటీ రిజిస్టార్‌ డాక్టర్‌ రామానుజరావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్‌ బీ.వాల్యాను ఎగ్జామినర్‌గా నియమిస్తున్నట్టు ఈ నెల 26వ తేదీన మరో నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నియామక ఉత్తర్వులు జారీకావడంతో గొడవ మొదలైందని తెలుస్తోంది.

వైద్యవిద్యార్థులు గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో ఎగ్జామినర్‌ నేను అంటే నేను అంటూ ఆ ఇద్దరు వైద్యులు విద్యార్ధుల ముందే వాగ్వాదానికి దిగారు. దీంతో ఎవరు ఎగ్జామినరో తెలియక విద్యార్థులు అయోమయంలో పడ్డారు. రాత్రంతా నిద్రలేకుండా పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యామని, పరీక్ష కేంద్రంలో ఈ రాద్ధాంతం ఏమింటని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు డాక్టర్లకూ సర్ది చెప్పారు. ఇక పై 8 రోజులపాటు జరిగే పరీక్షల్లో నాలుగు రోజులకు ఒకరు, మిగిలిన నాలుగు రోజులు మరొకరు ఎగ్జామినర్‌గా వ్యవహరిస్తారని కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ప్రకాశ్ రావు వివరణ ఇచ్చారు.

కాగా, ఈ ఇద్దరు డాక్టర్ల మధ్య రెండేళ్లుగా విబేధాలు ఉన్నాయని తెలిసింది. ఆర్ధోపెడిక్‌ హెచ్‌ఓడీగా బి. వాల్య ఉండగా, నిబంధనల ప్రకారం మరో ప్రొఫెసర్‌ సత్యనారాయణ హెచ్‌ఓడీగా నియమితులయ్యారు. గాంధీ ఆస్పత్రి ఆర్ధోపెడిక్‌ విభాగంలోని హెచ్‌ఓడీ రూం విషయంలో డాక్టర్ల మధ్య విభేదాలు ప్రారంభమై తారస్థాయికి చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయారని విద్యార్థులు తెలిపారు. వీరి వ్యవహారంతో పలువురు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Also Read: Biological E: హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్.. బయోలాజికల్ ఈ రూపొందిస్తున్న టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి

Greater RTC: గ్రేటర్ ఆర్టీసీకి కరోనా కష్టం.. ప్రయాణికులు లేక వెలవెలబోతున్న బస్సులు.. ట్రిప్పుల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు!