Telangana: సాధువులకు ఇంత దివ్యశక్తి ఉంటుందా..? వారు చెప్పిన చోట తవ్వకాలు జరుపగా..

గోదావరి పరిక్రమ యాత్రలో ఆ ప్రాంతానికి వచ్చిన సాదు సంతులు చెప్పిన మాటే నిజమైంది. గోదావరి తీరానికి సమీపంలోని ఓ స్థలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది‌. పెద్ద ఎత్తున తరలొచ్చిన భక్త జనం ఎదుట సాగిన తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడటంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా కోలహాలంగా మారింది. అసలేం జరిగిందంటే..

Telangana: సాధువులకు ఇంత దివ్యశక్తి ఉంటుందా..? వారు చెప్పిన చోట తవ్వకాలు జరుపగా..
Image Credit source: CH. Phani Shankar

Edited By: Ram Naramaneni

Updated on: Dec 15, 2025 | 5:37 PM

మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం ముల్కల గ్రామంలో గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ పీఠానికి చెందిన మలుక్ పీఠాధిపతి జగద్గురు దావరాచార్య రాజేంద్ర దాస్ జీ మహారాజ్ శిష్య బృందం ఈ నెల 10 న గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. తిరిగి వెళుతున్న సమయంలో ముల్కల గోదావరి తీర సమీపంలోని పోచమ్మ గుడి పక్కన ఆగారు. ఆ సమీపంలో ఏదో దివ్యశక్తి ఉందంటూ స్థానికులకు సూచించారు. ఓప్రైవేట్ స్థలంలోకి వెళ్లిన సాదు సంతులు ఇక్కడ తవ్వితే అమ్మవారి శక్తి రూపం దర్శనమిస్తుందంటూ సూచించారు. సాదు సంతులు చెప్పిన మాటలతో భూయజమానిని ఒప్పించిన స్థానికులు నేడు ఆ స్థలంలో జేసీబీల సాయంతో తవ్వకాలు చేపట్టారు. గంట సమయం తర్వాత రాజేంద్ర దాస్ శిష్యుడు వెంకటేష్ మహారాజ్ చెప్పినట్టుగానే అమ్మవారి విగ్రహం బయటపడింది. సింహవాహిని‌ రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి స్థానిక జనం జై దుర్గమాత అంటూ భక్తి పారవశ్యంతో పులకరించిపోయారు. ఈ మాట ఆ నోట ఈ నోట జిల్లా అంత పాకడంతో ఆ స్థలానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఆ స్థలంలోనే అమ్మవారికి ఆలయం నిర్మిస్తామంటూ చెప్తున్నారు ముల్కల వాసులు. అమ్మవారి విగ్రహం బయటపడటంతో వేద మంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహానికి పూజలు చేశారు.

డిసెంబర్ ఆరున ప్రారంభమైన గోదావరి పరిక్రమ ( ప్రదక్షిణ ) యాత్రలో భాగంగా ఈనెల 9 న బాసర చేరుకున్న మలుక్ పీఠాధిపతి జగద్గురు దావరాచార్య రాజేంద్ర దాస్ జీ మహరాజ్ బృందం.. 600 మంది సాదుసంతులతో కలిసి నిర్మల్, మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. గోదావరి తీర ప్రాంతాల్లోని పుణ్య క్షేత్రాలను సందర్శించారు. నిత్య గోదావరి నిర్వహిస్తూ ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం చేరుకున్నారు. గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ పీఠానికి చెందిన మలుక్ పీఠాధిపతి జగద్గురు దావరాచార్య రాజేంద్ర దాస్ జీ మహారాజ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు, మండలేశ్వర్లు, మహా మండలేశ్వర్లు సుమారు 600 మంది సాధువులు ఈ యాత్ర కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.