Telangana: బీజేపీ సభా వేదికపై ఆ ఇద్దరు ఎడమొఖం.. పెడమొఖం

ఒకరు ఏమో పార్టీకి జోష్ తెచ్చిన తాజా మాజీ అధ్యక్షులు.. మరొకరు ఏమో పార్టీ ఎన్నికల బాధ్యతలను తాజాగా భుజానికి ఎత్తుకున్న వ్యక్తి. ప్రధాని సభలో వీరిద్దరు పక్కపక్కనే కూర్చున్నప్పటికీ.. అస్సలు మాట్లాడుకోలేదు.

Telangana:  బీజేపీ సభా వేదికపై ఆ ఇద్దరు ఎడమొఖం.. పెడమొఖం
PM Modi - Bandi Sanjay, Etela Rajender

Edited By:

Updated on: Jul 08, 2023 | 2:59 PM

నిన్న మొన్నటి వరకు  పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్.. పార్టీలో కొత్తగా పదవి సంపాదించి జోష్‌లో ఉన్న ఈటల రాజేందర్ ఇద్దరూ కూడా మోడీ సభలో పక్కనే కూర్చున్నారు. బండి సంజయ్ సభా వేదిక దగ్గర కు రాగానే ఈటలకు నమస్కరించారు కానీ తర్వాత ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్న పెద్దగా ఇష్టపూర్వకంగా ముచ్చటించుకున్నట్టు కనపడలేదు. బండి సంజయ్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఈటెల ప్రస్తావన రాలేదు. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందరం సహకరిస్తామంటూ చెప్పుకొచ్చిన బండి సంజయ్.. ఈటల గురించి ఎక్కడ మాట్లాడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

మరోపక్క సభ ముగియగానే నరేంద్ర మోడీ వేదిక మీద ఉన్న ఈటెల బండి సంజయ్ దగ్గరకు వచ్చి చేతిలో చెయ్యేసి ఇద్దరితో ఏదో చెప్పి వెళ్లారు. వారిద్దరికీ ఏం చెప్పారనే దానిపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉండడంతో ఇప్పుడు ఒకరు పదవి కోల్పోయి మరొకరికి పదివి రావడం వల్ల కూడా గ్యాప్ పెరిగింది. రానున్న రోజుల్లో వీళ్లిద్దరి సమన్వయం ఏ విధంగా ఉంటుందని ఆందోళన కార్యకర్తల్లో కూడా ఉంది. కొత్త అధ్యక్షులు రెడ్డి ఇద్దరి మధ్య సమన్వయం చేసి ముందుకు తీసుకొని వెళ్తారా లేదా అనేది చూడాలి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.