Telangana: ధరణి కమిటీ నివేదిక సిద్ధం.. వందకుపైగా సూచనలతో ఫైనల్ రిపోర్ట్‌.. త్వరలోనే సీఎం రేవంత్‌తో భేటీ..

|

Jul 02, 2024 | 9:06 PM

ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వరుసగా భేటీలు నిర్వహంచిన ధరణి కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా, రైతు సంఘాలతో మాట్లాడిన కమిటీ తుది నివేదికను రూపొందించింది. వందకుపైగా సూచనలతో రిపోర్ట్‌ రెడీ చేసిన కమిటీ.. సీఎం రేవంత్‌ రెడ్డిని అపాయింట్‌మెంట్‌ కోరింది.

Telangana: ధరణి కమిటీ నివేదిక సిద్ధం.. వందకుపైగా సూచనలతో ఫైనల్ రిపోర్ట్‌.. త్వరలోనే సీఎం రేవంత్‌తో భేటీ..
Revanth Reddy
Follow us on

ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వరుసగా భేటీలు నిర్వహంచిన ధరణి కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా, రైతు సంఘాలతో మాట్లాడిన కమిటీ తుది నివేదికను రూపొందించింది. వందకుపైగా సూచనలతో రిపోర్ట్‌ రెడీ చేసిన కమిటీ.. సీఎం రేవంత్‌ రెడ్డిని అపాయింట్‌మెంట్‌ కోరింది. కలెక్టర్‌తో పాటు MRO, RDOలకు అధికారాలు బదిలీ చేయడంతో పాటు భూముల వాస్తవ పరిస్థితిపై పూర్తిస్థాయి సర్వే చేయడానికి సర్వేయర్లను నియమించాలని.. భూ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే నిర్దిష్ట సమయంలో సమస్య పరిష్కారమయ్యే విధంగా గడువు విధించాలని కమిటీ సూచించనుంది. దీంతోపాటు.. భూ సమస్యలపై సమగ్ర కొత్త చట్టానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ధరణి ప్యానెల్ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

BRS ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని గతంలోనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే రెండు విడతలుగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో సమస్యలు ఉన్నాయని గుర్తించిన రేవంత్‌ ప్రభుత్వం.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించింది.

ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డులను నిర్వహించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని కమిటీని కోరారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ధరణి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రైతుల భూరికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..