DH Srinivasa Rao: ప్రజాసేవ అంటేనే రాజకీయాలు.. కేసీఆర్‌ ఆదేశిస్తే.. డీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ డీహెచ్‌ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. కాకపోతే ఇది హెల్త్ కి సంబంధించింది కాదు.. పొలిటికల్ అరంగేట్రంపై. ఇంతకీ ఆయన ఏ పార్టీలో చేరాలని భావిస్తున్నారు..? ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు?

DH Srinivasa Rao: ప్రజాసేవ అంటేనే రాజకీయాలు.. కేసీఆర్‌ ఆదేశిస్తే.. డీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు..
Dh Srinivasa Rao

Updated on: Mar 12, 2023 | 8:30 AM

తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు.. ప్రస్తుతం డాక్టర్‌గా తెల్లకోటు ధరించి పేషెంట్లకు సేవలందిస్తున్నారు. ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలన్న ఆకాంక్షను మరోసారి బయటపెట్టారు. ప్రజాసేవ అంటేనే రాజకీయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు. మొత్తానికి పొలిటికల్ ఎంట్రీ కోసం శ్రీనివాస్‌ తహతహలాడుతున్నట్టు క్లియర్‌ కట్‌గా స్పష్టమవుతోంది. డీహెచ్‌ ఎలాంటి కామెంట్ చేసినా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఆ మధ్య కొత్తగూడెంలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తానన్నారు. అక్కడితో ఆగకుండా.. కొత్తగూడెం నుంచి చాలా మంది చాలా తీసుకున్నారు. వాళ్లందరూ కూడా కొత్తగూడెంకు తిరిగి ఇచ్చేయ్యాలి. లేకపోతే ఇచ్చేలా చేద్దామంటూ శ్రీమంతుడు సినిమా డైలాగ్‌ వదిలి హాట్‌టాపిక్‌గా నిలిచారు. అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలోనూ డీహెచ్‌ స్వామి భక్తిని చాటుకున్నారు.

అప్పట్లో సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కిన వీడియో వైరల్ కావడంతో విమర్శలొచ్చాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. పైగా సమర్థించుకున్నారు కూడా. ఒక్కసారి కాదూ వందసార్లయినా బరాబర్‌ మొక్కుతానని వినయ విధేయత ప్రదర్శించారు. నిజానికి జలగం – వనమా గ్రూపులుగా విడిపోయిన కొత్తగూడెంలో ఎలాగైనా బరిలో నిలవాలని భావిస్తున్నారు శ్రీనివాస్‌.

అందుకే సందర్భం ఏదైనా రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షను బయటపెడుతూనే ఉన్నారు. అయితే బీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా..? కేసీఆర్‌ సాన్నిహిత్యమే తనకు సీటు వచ్చేలా చేస్తుందన్న శ్రీనివాస్‌ నమ్మకంతో అలా చెబుతున్నాడా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆయన కోరిక ఏమేరకు ఫలిస్తుందన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..