DGP Mahender Reddy: రేవంత్ రెడ్డి ప్రచారం అవాస్తవం.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఖండన..

|

Mar 03, 2022 | 12:40 PM

DGP Mahender Reddy on Revanth Reddy తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి.. తనపై చేసిన ఆరోపణలపై సెలవులలో ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై

DGP Mahender Reddy: రేవంత్ రెడ్డి ప్రచారం అవాస్తవం.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఖండన..
Mahender Reddy
Follow us on

DGP Mahender Reddy on Revanth Reddy తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి.. తనపై చేసిన ఆరోపణలపై సెలవులలో ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ఇంట్లో జారిపడిన ఘటనలో తన ఎడమ భుజం పైన బోన్ (SCAPULA) కు మూడు చోట్ల (Hairline fractures) ప్యాక్చర్ జరిగినట్లు ఎక్స్-రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐలో తేలిందన్నారు. దీంతో చికిత్స చేయించుకున్నానని.. భుజం కదలకుండా కట్టుకట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. విరిగిన బోన్ మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించడంతో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో వెళ్లినట్లు వివరించారు. తిరిగి, వైద్యుల సలహా మేరకు విధుల్లో చేరుతారని పేర్కొన్నారు. ఈ మేరకు రోజూ భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడతున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.

ఈ వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ తప్పుడు, భాద్యతా రహిత ప్రచారం చేయడంపట్ల మహేందర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదంటూ హితవు పలికారు. తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈ విధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒక ఉన్నత స్థాయిలో, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమే కాకుండా ప్రభుత్వంపై అపోహలు కలిగే అవకాశం ఉందని మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్థైర్యాన్ని దెబ్బతీయడంతోపాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందని డీజీపీ ఆందోళన వ్యక్తంచేశారు. భాధ్యతాయుతమైన సీనియర్ పబ్లిక్ సర్సీస్ అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణ, సంయయనం పాటించాలని మహేందర్ రెడ్డి సూచించారు.

Also Read:

AP High Court: ఏపీలో మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..

KGF 2: కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఖరారు.. సినిమా విడుదల తేదీపై మరోసారి క్లారిటీ..