Telangana: అర్హత ఉన్నా జీరో కరెంట్ బిల్లు రావట్లేదా..? మీకే ఈ గుడ్ న్యూస్

|

Jul 24, 2024 | 5:08 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం ఇంకా అందని లబ్ధిదారులకు సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. కొత్తగా జీరో బిల్లుల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.

Telangana: అర్హత ఉన్నా జీరో కరెంట్ బిల్లు రావట్లేదా..? మీకే ఈ గుడ్ న్యూస్
Gruha Jyothi
Follow us on

ఇచ్చిన హామిలను అమలు చేస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో గృహజ్యోతి స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం కింద 200 యూనిట్ల లోపు వాడుకునే గృహ విద్యుత్‌ వినియోగదారులకు ఉచితంగా కరెంటు అందిస్తున్న విషయం తెలిసిందే.  అయితే అన్ని అర్హతలు ఉన్నా.. తమకు లబ్ధి చేకూరడం లేదని ఇటీవల ఫిర్యాదులు వస్తున్నాయి. వారికి ఉప ముఖ్యమంత్రి భట్టి అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ను ఏ కుటుంబం వాడుకున్నా.. వారికి జీరో బిల్లులు ఇస్తామని స్పష్టం చేశారు.  అర్హత ఉన్నవారు గతంలో అప్లై  చేసుకోకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలు.. సమీప మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవాళ్లు డివిజన్ ఆఫీసుల్లో ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

గృహా జ్యోతి పథకం లబ్ధిదారులను గవర్నమెంట్ సెలెక్ట్   చేయలేదని.. గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని భట్టి గుర్తు చేశారు. అలా వచ్చిన దరఖాస్తులను.. పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి.. అర్హత ఉన్న వారందరికీ జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామని భట్టి స్పష్టం చేశారు. గృహజ్యోతి స్కీమ్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 46 లక్షల 19 వేల 236 కుటుంబాల‌ను అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి అమలుకోసం రూ.2,418 కోట్లను కేటాయించామ‌ని వెల్లడించారు. గృహజ్యోతి జీరో బిల్లులకు సంబంధించి డిస్కమ్‌లకు నెలనెలా ఆ మొత్తాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా గవర్నమెంట్ చెల్లిస్తోంద‌ని భట్టి తెలిపారు.

ఇక దరఖాస్తు చేసుకొని అర్హత ఉన్నా.. గృహజ్యోతి స్కీమ్ అందనివారు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వివరాలను సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇళ్లు మారినవారు, కరెంట్ మీటర్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌ లింక్ చేయకపోవడం, దరఖాస్తుల్లో తప్పులు దొర్లడం తదితర కారణాల వల్ల ప్రయోజనాలు పొందలేనివారు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..