Bhatti Vikramarka: తెలంగాణకు లాభమేం లేదు.. ఫార్ములా ఈ రేస్‌పై డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు
ఫార్ములా ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని.. ఓ కంపెనీకి లబ్ధి చేకుర్చడానికే ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఫార్ములా రేసుతో రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదన్నారు.
ఫార్ములా ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని.. ఓ కంపెనీకి లబ్ధి చేకుర్చడానికే ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఫార్ములా రేసుతో రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదన్నారు. ఈ వ్యవహారంలో బిజినెస్ రూల్స్ నిబంధనలు పాటించలేదని అన్నారు. ఫార్ములా ఈ-రేస్ టికెట్లు అమ్ముకుని ఓ కంపెనీ లబ్ధిపొందిందని అన్నారు. ఈ ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి ఇప్పటివరకు రూ.55 కోట్లు చెల్లించారని, మిగతా రూ.55 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి నోటీసులు వచ్చాయని తెలిపారు. అంతకుముందు ఈ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్‌కు మెమో జారీ చేసింది.
అభయహస్తం దరఖాస్తులు బాలానగర్ ఫ్లైఓవర్‌పై కనిపించడంపై డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ఎక్కడికి పోవని తెలిపారు. దీనిపై అనవసర ప్రచారం చేయొద్దని సూచించారు.
వీడియో చూడండి..
మరోవైపు దరఖాస్తులు రోడ్డుపై కనిపించడంపై GHMC కమిషనర్ సీరియస్ అయ్యారు. హయత్ నగర్‌తోపాటు కుత్బుల్లాపూర్‌లో డేటా ఎంట్రీ టీమ్ లీడర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిని సస్పెండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..