Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GMR School of Aviation: హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ మేంటెనెన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్.. ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం

విమానయానరంగంలో వస్తున్న అభివృద్ధితో నైపుణ్యం కలిగిన ఏర్ క్రాఫ్ట్ మేయింటెన్స్ సిబ్బందికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఏరోస్పేస్ పరిశ్రమ అవసరాలను తీర్చడం కోసం హైద్రాబాద్‌లో ఏవియేషన్ కోసం స్కూల్‌ ప్రారంభమైంది. విమానాల మేంటెనెన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం కోర్సులను జీఎమ్‌ఆర్‌ ఆఫర్ చేస్తుంది. స్కూల్ ఆఫ్ ఏవిషన్‌లో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది? ఆ విషయాలు మీకోసం....

GMR School of Aviation: హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ మేంటెనెన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్.. ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం
GMR School of Aviation
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Srilakshmi C

Updated on: Jan 09, 2024 | 5:52 PM

హైదరాబాద్‌, జనవరి 9: విమానయానరంగంలో వస్తున్న అభివృద్ధితో నైపుణ్యం కలిగిన ఏర్ క్రాఫ్ట్ మేయింటెన్స్ సిబ్బందికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఏరోస్పేస్ పరిశ్రమ అవసరాలను తీర్చడం కోసం హైద్రాబాద్‌లో ఏవియేషన్ కోసం స్కూల్‌ ప్రారంభమైంది. విమానాల మేంటెనెన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం కోర్సులను జీఎమ్‌ఆర్‌ ఆఫర్ చేస్తుంది. స్కూల్ ఆఫ్ ఏవిషన్‌లో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది? ఆ విషయాలు మీకోసం..

GMR స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులను స్టార్ట్ చేస్తుంది.3 ఏకరాల స్థలంలో రానున్న జూన్‌లో ఈ స్కూల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన 50 శాతం ఉత్తీర్ణత అయిన వారు మాత్రమే అర్హులు. ఏడాదికి 2 వందల మందికి విద్యార్దులకు శిక్షణ ఇచ్చి, పూర్తి స్థాయిలో ప్లేస్‌మెంట్ అవకాశం కల్పించే విధంగా GMR ఏవియేషన్ స్కూల్ రెడీ అవుతుంది. నాలుగు సంవత్సరాల కోర్సులో రెండు సంవత్సరాల థియరీ, 2 సంవత్సరాలు ప్రాక్టికల్స్ ఉంటాయనీ.. అనంతరం ప్లేస్మేంట్ కూడా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఇచ్చే కోర్సుల్లో ఇండియన్, ఫారిన్ రెండు రకాల శిక్షణ ఇస్తాంఅని అంటున్నారు. B1, B2ఏ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ లైసెన్స్ ప్రోగ్రాంను ఎయిర్ బస్ కోలాబరేషన్ తో ప్రాక్టికల్ గా ట్రైనింగ్ ఇవ్వనుంది. దీంతో పాటు.. ఎయిర్‌క్రాఫ్ట్ స్పెసిఫిక్ టైప్ ట్రైనింగ్ కోర్సులు, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ వంటి అనుబంధ కోర్సులను అందించడం ద్వారా దేశంలోనే ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ శిక్షణలో ఒక బెంచ్‌మార్క్ సెట్ చేయాలని స్కూల్ ఆఫ్ ఏవియేషన్ భావిస్తుంది.

ఈ ట్రైనింగ్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు యూరోపియన్ యూనియన్ ఎలివేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) నుండి అదేవిధంగా, DGCA నుంచి సర్టిఫికెట్లు అందజేస్తామని అంటున్నారు. EASA సర్టిఫికెట్ పొందిన వారు విదేశాలలో ఏర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్‌లో విధులు నిర్వహించవచ్చని, DGCA సర్టిఫికెట్ పొందినవారు దేశంలో ఎక్కడైనా ప్లేస్మెంట్ పొందొచ్చని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఏవియేషన్ రంగంలో ప్రపంచంలోనే ఇండియా అగ్రస్థానంలో నిలిచేందుకు దూసుకుపోతోంది. ఈ రంగంలో భవిష్యత్ తరాలు ఫోకస్ చేసేలా అకాడమీ మార్గం సుగమం చేస్తుందని అకాడమీ నిర్వహకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.