Telangana Budget 202: రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు మహర్ధశ.. నిర్మాణంపై సర్కార్ కీలక అప్టేట్!

|

Jul 25, 2024 | 1:53 PM

తెలంగాణ దశ దిశను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సూపర్ గేమ్ ఛేంజర్ కానున్న రీజనల్ రింగ్ ప్రాజెక్టుకు పెద్ద పీట వేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు భట్టి.

Telangana Budget 202: రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు మహర్ధశ.. నిర్మాణంపై సర్కార్ కీలక అప్టేట్!
Telangana Budget
Follow us on

తెలంగాణ దశ దిశను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సూపర్ గేమ్ ఛేంజర్ కానున్న రీజనల్ రింగ్ ప్రాజెక్టుకు పెద్ద పీట వేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు భట్టి. ట్రిపుల్ ఆర్ రోడ్డు అందుబాటులోకి వస్తే తెలంగాణ పట్టణ రాష్ట్రంగా మారుతుందని అన్నారు. హైదరాబాద్‌ ఔటర్ రింగు రోడ్డుకు సుమారు 40 కి.మీ దూరం నుంచి ఉత్తర, దక్షిణ భాగాలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. .

ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం. ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయటంతో హైదరాబాద్ నగరాభివృద్ధి మరింత వేగవంతమయ్యిందన్నారు. ఇలాంటి ఫలితాలను రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ (RRR) దోహదపడుతుందన్నారు.
ఇందులో భాగంగా ఉత్తర ప్రాంతంలోని 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి–తూప్రాన్ – గజ్వేల్ – చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్ -షాద్ నగర్-సంగారెడ్డి రోడ్డును, జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్నారు.

రీజినల్ రింగు రోడ్డు హైదరాబాదు నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలనూ, తూర్పు పశ్చిమ ప్రాంతాలనూ కలుపుతూ జాతీయ రహదారి నెట్ వర్క్‌తో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఎక్స్‌ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లేన్లతో నిర్మించి దానిని ఎనిమిది లేన్ల సామర్థ్యానికి విస్తరింపజేస్తామని మంత్రి భట్టి తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్‌కు ఆర్ఆర్ఆర్‌కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్ఆర్ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 కోట్ల రూపాయలు, దక్షిణ ప్రాంతాభివృద్ధికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. దీని కోసం ఈ బడ్జెట్ లో 1,525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…