CM KCR: శనివరం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కారణం ఇదే..

|

May 26, 2023 | 3:14 PM

బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు( కేసీఆర్)తో అరవింద్ కేజ్రీవాల్‌ సమావేశం కానున్నారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశంలో

CM KCR: శనివరం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కారణం ఇదే..
Arvind Kejriwal To Meet Telangana CM KCR
Follow us on

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు( కేసీఆర్)తో అరవింద్ కేజ్రీవాల్‌ సమావేశం కానున్నారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశంలో విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. పార్లమెంట్ లో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని.. సీఎం కేసీఆర్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరనున్నారు.

ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై యుద్దాన్ని తీవ్రం చేశారు సీఎం కేజ్రీవాల్‌. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతున్నారు కేజ్రీవాల్‌. కేజ్రీవాల్‌కు ఇప్పటికే బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ సంపూర్ణమద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే కూడా సపోర్టు చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని వారు ఆరోపించారు.

ఢిల్లీలో పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసి సంగతి కేజ్రీవాల్‌ గుర్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 8 రోజులకు కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఎల్‌జీకి అధికారం కట్టబెట్టిందని.. దీనిపై మరోసారి న్యాయపోరాటం చేస్తామన్నారు.

ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్‌ బదిలీల నియామకాలపై కేంద్రం కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును పూర్వపక్షం చేసేలా ఆర్డినెన్స్‌ని కేంద్ర ‍ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ శీతకాల సమావేశంలో ఆమెదించిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రాహుల్‌ గాంధీని, మల్లిఖార్జున్‌ ఖర్గేని కలిసి, సమావేశమయ్యేందుకు సమయం కావాలని విపక్ష పార్టీలను కలుస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం