AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదరికాన్ని జయించి వైద్య విద్యలో అడుగు.. దీక్షిత విజయగాథ

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గంగ్వార్ గ్రామానికి చెందిన పేద రైతు కుటుంబ విద్యార్థిని దీక్షిత నీట్‌లో 449 మార్కులు సాధించి ఈడబ్ల్యూఎస్ కోటాలో నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. గురుకుల విద్యతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన పట్టుదలతో వైద్యురాలు కావాలనే కల దిశగా వడివడిగా సాగుతున్న దీక్షిత ప్రయాణం ఎంతోమంది గ్రామీణ విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది.

పేదరికాన్ని జయించి వైద్య విద్యలో అడుగు.. దీక్షిత విజయగాథ
Dekshitha
Ram Naramaneni
|

Updated on: Sep 19, 2026 | 8:50 AM

Share

కలలు కనడానికి ఆర్థిక స్థోమత అవసరం లేదు.. వాటిని సాకారం చేసుకోవాలనే పట్టుదల ఉంటే చాలు. కష్టాలను ఎదుర్కొంటూ చదువులో ముందుకు సాగిన విద్యార్థిని దీక్షిత తన విజయంతో ఈ విషయాన్ని నిరూపించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె వైద్యురాలు కావాలనే లక్ష్యంతో సాగించిన ప్రయాణం ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది.

గురుకుల విద్యతో లక్ష్యం వైపు..

వికారాదాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన దీక్షిత చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకుంది. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ విద్యకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తిచేసిన అనంతరం గురుకుల విద్యలో అడుగుపెట్టింది.

6 నుంచి 10వ తరగతి వరకు గురుకులంలో చదువుకున్న దీక్షిత.. ఇంటర్ విద్యను కొత్తగడిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలో అభ్యసించింది. పరిమిత వనరులు ఉన్నప్పటికీ తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. వైద్య విద్య సాధించాలనే సంకల్పంతో కష్టపడి చదివింది. వ్యవసాయంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ తల్లిదండ్రులు భీంరెడ్డి-స్వప్న.. కూతురి ఆసక్తిని తెలుసుకుని నిత్యం ప్రొత్సహిస్తూ ముందుకు సాగారు.

నీట్‌లో 449 మార్కులు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు

వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో దీక్షిత 449 మార్కులు సాధించింది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. ఈ విజయం దీక్షిత కుటుంబంలో ఆనందాన్ని నింపింది. తల్లీదండ్రుల సహకారం, గురుకుల విద్య ద్వారా లభించిన అవకాశాలు, తన కష్టం కలిసి ఆమెను వైద్య విద్య వైపు నడిపించాయి.

పట్టుదల ఉంటే పేదరికం అడ్డంకి కాదు..

దీక్షిత విజయాన్ని కేవలం ఒక మెడికల్ సీటు సాధించిన ఘట్టంగా మాత్రమే చూడలేం. సాధారణ కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి కోసం కష్టపడవచ్చనే సందేశాన్ని ఆమె ప్రయాణం అందిస్తోంది. చదువుకోవాలనే కోరిక ఉన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహం, సరైన మార్గదర్శకత్వం, అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు ఎంతో ముఖ్యమైనవి. దీక్షిత తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని వైద్య విద్యలో అడుగుపెట్టింది.

కలలు కనండి.. కష్టపడి చదవండి.. పరిస్థితులు ఎలా ఉన్నా లక్ష్యాన్ని వదులుకోవద్దు. దీక్షిత విజయగాథ గ్రామీణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే స్ఫూర్తిదాయక ప్రయాణం.

Follow Us
'తల్లి బీడీలు చుట్టి చదివిస్తే.. కొడుకు IAS అయ్యాడు' UPSC టాపర్‌
'తల్లి బీడీలు చుట్టి చదివిస్తే.. కొడుకు IAS అయ్యాడు' UPSC టాపర్‌
ఆ హీరో నేను మారువేషంలో బిర్యానీ తినడానికి వెళ్లేవాళ్లం..
ఆ హీరో నేను మారువేషంలో బిర్యానీ తినడానికి వెళ్లేవాళ్లం..
గురుకుల విద్యతో లక్ష్యం వైపు దీక్షిత..
గురుకుల విద్యతో లక్ష్యం వైపు దీక్షిత..
మునగాకుతో రోటీ పచ్చడి.. ఇలా చేస్తే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే
మునగాకుతో రోటీ పచ్చడి.. ఇలా చేస్తే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే
'బదిలీ ఆర్డర్ టైప్ చేసేలోపు మంత్రిని అరెస్ట్ చేసి CMకే చుక్కలు'
'బదిలీ ఆర్డర్ టైప్ చేసేలోపు మంత్రిని అరెస్ట్ చేసి CMకే చుక్కలు'
తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్..
తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్..
పగను మోస్తే నష్టపోయేది ఎవరు? ఈ కథలో దాగిన అద్భుతమైన నీతికథ ఇదే!
పగను మోస్తే నష్టపోయేది ఎవరు? ఈ కథలో దాగిన అద్భుతమైన నీతికథ ఇదే!
డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేవారికి కొత్త రూల్స్..
డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేవారికి కొత్త రూల్స్..
భార్యకు సర్‌ప్రైజ్ చేసేందుకు భర్త మాస్టర్ ప్లాన్..
భార్యకు సర్‌ప్రైజ్ చేసేందుకు భర్త మాస్టర్ ప్లాన్..
ఈ 3 మీ రోజును పాడుచేసే మార్నింగ్‌ అలవాట్లు! ఈ తప్పులు చేయకండి!
ఈ 3 మీ రోజును పాడుచేసే మార్నింగ్‌ అలవాట్లు! ఈ తప్పులు చేయకండి!