AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌ గాలి నాణ్యత ఎంతో తెలుసా?

దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. టపాసుల పొగతో పలు ప్రాంతాల్లో AQI ప్రమాదకర స్థాయికి చేరింది. కొన్ని చోట్ల 1,700 దాటినట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లోనూ కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 8న నగర సగటు AQI 321గా నమోదైంది. ప్రకాశ్ నగర్, కూకట్‌పల్లి, బిక్షపతి నగర్ ప్రాంతాల్లోనూ అధిక కాలుష్య స్థాయులు నమోదైనట్లు నివేదికలు వెల్లడించాయి. ఢిల్లీ, హైదరాబాద్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌ గాలి నాణ్యత ఎంతో తెలుసా?
Diwali Air Pollution
Srilakshmi C
|

Updated on: Nov 09, 2026 | 8:51 AM

Share

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి సంబరాలు ముగిసినా బాణసంచా పొగ మాత్రం నగరాన్ని వీడటం లేదు. టపాసుల మోతతో ఢిల్లీ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో AQI 1,700 దాటినట్లు అందిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్లపై విజిబిలిటీ సైతం 500 మీటర్లకు పడిపోయింది. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పలుచోట్ల ఈ నిబంధనలను పట్టించుకోకుండా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా బాణసంచా కాల్చినట్లు సమాచారం. దీంతో నగరంలోని పలు ప్రాంతాలను పొగ కమ్మేసింది. ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది.

16 ప్రాంతాల్లో 400 దాటిన AQI

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ తీవ్ర స్థాయికి చేరింది. కొన్ని ప్రాంతాల్లో AQI 1700 దాటినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గాలిలో దుమ్ము, ధూళి కణాల సాంద్రత పెరగడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులకు విజిబిలిటీ సమస్యలు ఎదురవుతున్నాయి. కాలుష్య ప్రభావం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ గాలి నాణ్యత ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 8న నగరం మొత్తం మీద సగటు AQI 321గా నమోదైనట్లు అందిన సమాచారం వెల్లడిస్తోంది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నమోదైన AQI వివరాలు ఇలా ఉన్నాయి..

  • ప్రకాశ్ నగర్ స్టేషన్ 2: 828
  • కూకట్‌పల్లి: 628
  • బిక్షపతి నగర్: 625
  • హైదరాబాద్ నగర సగటు AQI: 321

ఈ గణాంకాలు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్య తీవ్రతను సూచిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీపావళి టపాసుల పొగతో పాటు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పంట వ్యర్థాల దహనం, వాహనాల నుంచి వెలువడే పొగ, నిర్మాణ కార్యకలాపాల వల్ల వచ్చే దుమ్ము, గాలి వేగం తగ్గడం, చలి తీవ్రత పెరగడం వంటి అంశాలు కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి. కాలుష్యం పెరగడంతో ఢిల్లీ వాసులు కళ్ల మంటలు, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతున్నారు. కొందరు వైద్య సహాయం కోసం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లోని ఒకటి, రెండు, మూడు దశల చర్యలు అమల్లో ఉన్నాయి.

దీపావళి తర్వాత ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోనూ నమోదవుతున్న కాలుష్య గణాంకాలు నగరాల గాలి నాణ్యతపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్య నియంత్రణ చర్యలను మరింత సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

Follow Us
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..