Hyderabad: నగరంలో అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబరాలు.. పలువురిపై కేసులు నమోదు..

| Edited By: Srikar T

Jan 01, 2024 | 11:52 AM

హైదరబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి. పాతబస్తీ చార్మినార్ దగ్గర యువతీయువకులు బాణాసంచా పేలుస్తూ కొత్తేడాదికి స్వాగతం పలికారు. విద్యుత్ కాంతులతో ధగధగలాడిన చార్మినార్ వద్ద కేక్ కట్ చేసిన హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి డ్రంకెన్ డ్రైవ్‎పై ప్రత్యేకంగా పోస్టర్ విడుదల చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గల్లీగల్లీ జల్లెడపట్టారు పోలీసులు. డీసీపీ చైతన్య ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై డాగ్ స్క్వాడ్‎తో ప్రత్యేక నిఘా పెట్టారు.

Hyderabad: నగరంలో అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబరాలు.. పలువురిపై కేసులు నమోదు..
Hyderabad New Year
Follow us on

హైదరబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి. పాతబస్తీ చార్మినార్ దగ్గర యువతీయువకులు బాణాసంచా పేలుస్తూ కొత్తేడాదికి స్వాగతం పలికారు. విద్యుత్ కాంతులతో ధగధగలాడిన చార్మినార్ వద్ద కేక్ కట్ చేసిన హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి డ్రంకెన్ డ్రైవ్‎పై ప్రత్యేకంగా పోస్టర్ విడుదల చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గల్లీగల్లీ జల్లెడపట్టారు పోలీసులు. డీసీపీ చైతన్య ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై డాగ్ స్క్వాడ్‎తో ప్రత్యేక నిఘా పెట్టారు. గంజాయి సేవించే వారిని పట్టుకోవడం కోసం శ్మశానాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంజాయి మత్తులో చిత్తుకావొద్దని డీసీపీ సూచించారు. గంజాయి విక్రయాలు, డ్రగ్స్ వినియోగంపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిఘా పెంచారు. ఉప్పల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ కేక్ కట్ చేసి గ్రీటింగ్స్ చెప్పారు రాచకొండ సీపీ సుధీర్ రెడ్డి. అందరి సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యమన్నారు. లక్ష్య సాధనలో వెనకడుగు వేయొద్దని యువతకు సూచనలిచ్చారు. పాతబస్తీ పరిసరాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసు నమోదు చేశారు. మొత్తంగా 25వాహనాలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. న్యూ ఇయర్ సంబురాలను ప్రశాంత వాతావరణంలో జరపుకోవాలని కోరుతూ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

కొత్త సంవత్సరం వస్తోందంటే హైదరాబాద్లో యువత జోష్ అంతాఇంతా కాదు. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో గల్లీగల్లీలో నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. సాధారణ ప్రజల నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు న్యూ ఇయర్ సంబురాలు జరుపుకున్నారు. కొత్తేడాదిలో కొత్త ఆశలతో జీవితం ప్రారంభించాలని కోరారు. చార్మినార్, ఉప్పల్లో పోలీస్ కమిషనర్లు కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. చార్మినార్ దగ్గర భారీ కేకు కట్ చేసి యువకులకు పంచిపెట్టారు సీపీ శ్రీనివాసరెడ్డి. అనంతరం డ్రంకెన్ డ్రైవ్ పై అవగాహన కల్పించేలా ఏర్పాటు చేసిన పోస్టర్ను ప్రారంభించారు. మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును చిత్తు చేసుకోవద్దని సూచించారు సీపీ శ్రీనివాసరెడ్డి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని కోరారు. మద్యం మత్తులో ప్రమాదానికి గురైతే కుటుంబాల్లో విషాదం తప్పదన్నారు. ఒకరి తప్పుకు అమాయకులు బలికావాల్సి ఉంటుందన్నారు. ప్రమాదాల నివారణకు మద్యం, మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..