ఐఏఎస్ అధికారుల సంఘం క్లబ్‌లో న్యూ ఇయర్ వేడుకలు.. సందడి చేసిన సీఎం రేవంత్ దంపతులు
బేగంపేటలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వేడుకకు హాజరైన అధికారులను సీఎం పేరుపేరునా పలకరించారు. అందరితో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సీఎం దంపతులను సంఘం అధ్యక్షుడు శశాంక్ గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారులు...
ఆదివారం రాత్రి నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వైభవంగా జరుగుతున్నాయి. పాత ఏడాదికి గుడ్ బై చెప్పి, కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. సాధారణ ప్రజలు మొదలు అధికారులు, రాజకీయ నాయకుల వరకు కొత్తేడాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తెలంగాణ ఐఎస్ అధికారుల సంఘం క్లబ్‌లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు.
బేగంపేటలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వేడుకకు హాజరైన అధికారులను సీఎం పేరుపేరునా పలకరించారు. అందరితో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సీఎం దంపతులను సంఘం అధ్యక్షుడు శశాంక్ గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారులు తమ కుటుంబ సభ్యులతో సీఎం దంపతులను కలిశారు.
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, విశ్రాంత ఐఏఎస్ అధికారులు సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ వేడుకకు ఐఏఎస్ అధికారులు హరిత, నిఖిల, ఆమ్రపాలి, విజయేంద్ర, కుర్రా లక్ష్మీ, శ్రీదేవసేన, శృతి ఓజా, సీఎస్ శాంతికుమారితో పాటు తదితరులు హాజరయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..