సలసలా మరుగుతున్న వేడి నీటిని.. అత్త ముఖంపై పోసిన కోడలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోడలు నవీన అత్త ఈశ్వరిని చిత్రహింసలకు గురిచేసింది. అడ్డుకున్న అత్త సోదరి ఊర్మిళపై వేడినీరు పోసింది. ఊర్మిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు నవీన, ఆమె భర్త సతీష్‌పై కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

సలసలా మరుగుతున్న వేడి నీటిని.. అత్త ముఖంపై పోసిన కోడలు!
Boiling Water

Edited By:

Updated on: May 02, 2025 | 7:54 PM

అత్తలపై ఓ కోడలు దాష్టీకానికి దిగింది. అత్త ఈశ్వరిని చిత్రహింసలు పెడుతుండగా ఆడుకునేందుకు వెళ్లిన ఆమె సోదరి ఊర్మిళ ముఖంపై కోడలు నవీన వేడి నీళ్లు పోసిన సంఘటన కలకలం రేపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలో సతీష్, నవీన అనే దంపతులు నివశిస్తున్నారు. వారి వద్దనే తల్లి ఈశ్వరి ఆమె సోదరి ఊర్మిళా కూడా ఉంటున్నారు. గత కొంతకాలంగా కోడలు నవీన, అత్త ఈశ్వరినీ వేధింపులకు గురిచేస్తోంది. ఆమె అలా చేస్తున్నా.. కొడుకు సతీష్ అడ్డుచెప్పకుండా.. భార్యకు సహకరించేవాడు.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఈశ్వరీ ని కోడలు నవీన చిత్రహింసలకు గురిచేస్తూ పొయ్యిలో ఉన్న కట్టెతో కాల్చే ప్రయత్నం చేస్తుండడంతో అక్కడే ఉన్న ఆమె సోదరి ఊర్మిళ అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన నవీన, ఊర్మిళ తలపై బలంగా కొట్టడంతో పాటు పొయ్యి మీద ఉన్న వేడి వేడి నీటిని ఊర్మిళపై పోసింది. దీంతో ఊర్మిళకు తీవ్ర గాయాల పాలవడంతో స్థానికులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం మణుగూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఊర్మిళ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆమె సోదరి ఈశ్వరి ఇచ్చిన ఫిర్యాదుతో అశ్వాపురం పోలీసులు కొడుకు కోడలు సతీష్, నవీనలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మానవత్వం మంటగలిసేలా ప్రవర్తించిన సతీష్ నవీన దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి