Cyber Crime: ఈ ఐడీతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వస్తే అస్సలు ఓకే చేయకండి.. పొరపాటున చేశారో.

|

Mar 06, 2023 | 4:05 PM

ఇంటర్‌ నెట్‌ విస్తృతి పెరిగిన తర్వాత నేరాల స్వభావం కూడా మారిపోయింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరస్థులు తమ పంథాను మార్చుకుంటున్నారు. హైటెక్‌ టెక్నాలజీ డబ్బులు కాజేస్తున్నారు. మొన్నటి వరకు హ్యాకింగ్‌..

Cyber Crime: ఈ ఐడీతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వస్తే అస్సలు ఓకే చేయకండి.. పొరపాటున చేశారో.
Cyber Crime
Follow us on

ఇంటర్‌ నెట్‌ విస్తృతి పెరిగిన తర్వాత నేరాల స్వభావం కూడా మారిపోయింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరస్థులు తమ పంథాను మార్చుకుంటున్నారు. హైటెక్‌ టెక్నాలజీ డబ్బులు కాజేస్తున్నారు. మొన్నటి వరకు హ్యాకింగ్‌ చేసి ఖాతాల్లోని డబ్బులు కాజేసిన కేటుగాళ్లు ఇప్పుడు భయమే పెట్టుబడిగా నేరాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్‌ వేదికగా కొత్త దందాకు తెర తేశారు. పోర్న్‌స్టార్‌ ఫొటోలు.. విదేశీ యువతుల ఫొటోలు డీపీలుగా పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. న్యూడ్ వీడియో కాల్స్ చేసి..తర్వాత డబ్బులు దండుకోవడం, విదేశాల్లో జాబ్స్ పేరుతో నిండా ముంచడం, తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలు అని దోచుకోవడం..ఈ గ్యాంగ్ స్పెషాలిటీ..!!

‘హాయ్‌…నా పేరు ఎమ్రీ…నాది కెనడా. నా వయస్సు 35 ఏళ్లు. నేను చాలా రిచ్‌..నాకొక ఫ్రెండ్‌ కావాలి. అతని ఏజ్‌తో నాకు సంబంధం లేదు…అంటూ స్వీట్‌ వాయిస్‌’, మెస్సేజ్‌తో అలీస్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది పూర్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా సైబర్‌ ఛీటర్స్‌ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ పేజీకి అనుబంధంగా ఉన్న ఎన్నో నకిలీ అకౌంట్లలో కూడా పోర్న్‌స్టార్‌ ఫొటోలు ఉన్నాయి. అన్నీ పేజీల్లోనూ ఒకటే కంటెంట్‌..దానికి ఎట్రాక్ట్‌ అయ్యారా..? అంతే..మీ లైఫ్‌ స్పాయిల్…. అందమైన విదేశీ యువతుల ఫొటోలు, మాజీ పోర్న్‌స్టార్‌ల ఫొటోలు, ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాలకు డీపీలుగా పెట్టి.. ఆకర్షిస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.

ఒక అకౌంట్‌లో అలీస్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది పూర్‌ అని ఉంటే.. చాలా ఖాతాలకు ఫౌండేషన్‌ ఫర్‌ ది పూర్‌’ అనే పేరు కామన్‌గా ఉంటుంది. అలీస్‌ స్థానంలో పేర్లు మారుతూ ఉంటాయి. ఇక రెచ్చగొట్టేలా కనిపిస్తున్న ఆ ఫొటోలపై క్లిక్‌ చేస్తే..కింద వాట్సాప్‌ లింక్‌ ఓపెన్‌ అవుతుంది. కొందరికి టెలిగ్రామ్‌ లింక్‌ ఇస్తున్నారు. దానిని ఓపెన్‌ చేయగానే రెచ్చగొట్టే ఫొటోలతో తమ దారిలోకి తెచ్చుకుంటారు. అలా పరిచయం పెంచుకొని న్యూడ్‌ వీడియోకాల్స్‌ చేసి, దానిని రికార్డు చేసి, డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి ఫేస్‌బుక్‌ ఖాతాల నుంచి రిక్వెస్టులు వస్తే..స్పందించవద్దని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..