Hyderabad: అమ్మ బాబోయ్..! బిర్యానిలో వచ్చింది చూసి షాక్.. ఒక్కసారిగా అవాక్కైన కస్టమర్స్!

| Edited By: Balaraju Goud

Nov 26, 2024 | 9:45 AM

సిగరెట్టు లాంటి వ్యసనాలు అలవాటు లేవు అంటూ కుషీగా బిర్యాని తిందాం అని పోయినా యువకులకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయ్యింది..

Hyderabad: అమ్మ బాబోయ్..! బిర్యానిలో వచ్చింది చూసి షాక్.. ఒక్కసారిగా అవాక్కైన కస్టమర్స్!
Cigarette Peace In Biryani
Follow us on

బిర్యానిలో బొద్దింకలు.. బూజు పట్టిన చికెన్ లెగ్‌పీసులు.. క్రిమికీటకాల అవశేషాలు, గబ్బు కొడుతున్న గోంగూర.. వింటుంటూనే వాంతులొచ్చేలా ఉంది కదా. ఇవన్నీ తినే ప్లేట్‌లోకి వస్తే ఇంకెలా ఉంటుంది..? అలాంటి ఘటనే జరిగింది హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌లో..

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఏంటి సినిమాలో చెప్పాల్సింది ఇక్కడ వాడుతున్నారు అనుకుంటున్నారా..! సిగరెట్టు పీలుస్తే క్యాన్సర్ వస్తుంది. మాకు తెలుసు లె..మేం సిగరెట్టు తగాము అని ఫీల్ అవుతున్నారా..? తాజాగా జరిగిన ఓ సంఘటన వింటే మీకు తెలీకుండానే సిగరెట్టును తాగడం కాదు తిన్నాం ఏమో అని వనికిపోవాల్సిందే..!

సిగరెట్టు లాంటి వ్యసనాలు అలవాటు లేవు అంటూ కుషీగా బిర్యాని తిందాం అని పోయినా యువకులకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయ్యింది.. మ్యాటర్ లోకి వెళ్తే హైదరాబాద్ మహానగరంలోని ఫేమస్ అయిన బిర్యాని తినేందుకు వెళ్లిన యువకులకు సగం కాల్చిన సిగరెట్టు పలకరించింది.. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడో కాదు మోస్ట్ ఫేమస్ అయిన బావర్చి రెస్టారెంట్ లో జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న బావార్చి రెస్టారెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే బిర్యాని ఆర్డర్ చేసిన యువకులకు సగం కాలిన సిగరెట్టు చూసి చిర్రెత్తుకొచ్చింది. దీంతో సిగరెట్టు తాగుతూ వంట చేస్తున్నారా అంటూ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు కస్టమర్లు. చివరికి రెస్టారెంట్ యాజమాన్యం సర్ధి చెప్పడంతో గొడవ సర్ధుమణిగింది.

వీడియో చూడండి.. 

గతంలో ఇదే బావర్చి హోటల్ బిర్యానిలో బల్లి కనిపించింది. బిర్యానీ తినేందుకు ముందు పెట్టుకున్న వారికి బల్లి కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు కస్టమర్స్. పార్సిల్ తీసుకెళ్లిన బిర్యానిలో బల్లి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌ లోని బావర్చి ముందు ఆందోళనకు దిగారు. ఇటీవల హైదరాబాద్ ఫుడ్ పై వస్తున్న వార్తలు చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టి అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..