CRPF Jawan Dead: భద్రాచలం సీఆర్పీఎఫ్ క్యాంపులో తీవ్ర విషాదం.. వాలీబాల్ ఆడుతూ గుండెపోటుతో జవాన్ మృతి

CRPF Jawan Dead: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. భద్రాచలం సీఆర్పీఎఫ్ క్యాంపులో తీవ్ర విషాదం నెలకొంది. సీఆర్పీఎఫ్ క్యాంపులో పని చేస్తున్న 141 బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్..

CRPF Jawan Dead: భద్రాచలం సీఆర్పీఎఫ్ క్యాంపులో తీవ్ర విషాదం.. వాలీబాల్ ఆడుతూ గుండెపోటుతో జవాన్ మృతి
Crpf Jawan

Updated on: Sep 05, 2021 | 6:44 AM

CRPF Jawan Dead: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. భద్రాచలం సీఆర్పీఎఫ్ క్యాంపులో తీవ్ర విషాదం నెలకొంది. సీఆర్పీఎఫ్ క్యాంపులో పని చేస్తున్న 141 బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ కృష్ణ కుమార్ (27) గుండెపోటుతో మృతి చెందాడు. విరామ సమయంలో వాలీబాల్ అడుతుండగా గుండెపోటుతో వాలీబాల్ కోర్టు లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే సిబ్బంది స్పందించి కృష్ణ కుమార్ ను భద్రాచలం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కృష్ణ కుమార్ మరణించినట్లు వైద్య సిబ్బంది చెప్పారు. మృతుడు కృష్ణ కుమార్ ది స్వస్థలం రాజస్థాన్.. చిన్నవయసులోనే ఇలా హఠాత్తుగా మరణించడంతో క్యాంప్ లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులకు కృష్ణ కుమార్ మరణ వార్తను అధికారులు తెలిపారు.

 

Also Read:

 7 గంటల్లో 101 మంది మహిళలకు గర్భనిరోధక ఆపరేషన్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..

ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్.. అధికారుల తీరుని ఖండించిన బీజేపీ నేతలు

పదే పదే ఇబ్బంది పెడుతున్న అడవి దున్న.. ఆగ్రహించిన తల్లి ఏనుగు.. ఊహించని రీతిలో..