
తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యంలో ఎట్టకేలకు భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. వరుస ఎన్‌కౌంటర్లతో ఎరుపెక్కిన కర్రెగుట్టలపై మొట్టమొదటి సిఆర్‌పిఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటయింది. మావోయిస్టుల సేఫ్ జోన్ ఇకమీదట సామాన్యులకు ఆటవిడుపు అవ్వబోతుందా..? ఆయుధాలు సందడిచేసిన ఆ కీకారణ్యం ఇప్పుడు ప్రకృతి కాముకులకు విడిది కాబోతుందా..? వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాటు లతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులకు కర్రెగుట్టలు చేజారిపోవడం మరింత నష్టమేనా..?
తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మొన్నటి వరకు మావోయిస్టులకు ఏకైక సేఫ్ జోన్ కర్రెగుట్టలు.. ఆపరేషన్ ఖగార్ లో బాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని అబూస్‌మడ్‌ను హస్తగతం చేసుకున్న భద్రతా బలగాలు, ఆ తర్వాత ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో బాగంగా కర్రెగుట్ట లను స్వంతం చేసుకున్నాయి. కర్రెగుట్టలపై తుపాకుల ఎక్కుపెట్టిన కేంద్ర భద్రతా బలగాలు దాదాపు రెండు నెలల పాటు జల్లెడ పట్టాయి. కేంద్ర భద్రతా బలగాలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఎట్టకేలకు ఇక్కడ పైచేయి సాధించి హస్తగతం చేసుకున్నాయి. నింగి నేల నుండి తుపాకులు గుళ్ళ వర్షం కురిపించిన భద్రతా బలగాలు మావోయిస్టుల బంకర్లను పూర్తిగా ధ్వంసం చేశారు. కర్రెగుట్టలపై పోలీస్ జెండా ఎగురవేసారు..
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రెండు రాష్ట్రాల మధ్య మావోయిస్టులకు పెట్టని కోటగా నిలిచిన అతిపెద్ద సేఫ్ జోన్ కర్రెగుట్టలను పూర్తిగా ఇప్పుడు భద్రతా బలగాలు వారి హస్తగతం చేసుకున్నాయి. ఏకంగా కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సరిహద్దు వాజేడు మండలం మొరుమూరు వద్ద CRPF-39 వ బెటాలియన్ బేస్ క్యాంప్ ను సిఆర్‌పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పచ్చని అడవుల్లో తుపాకులు కవాతు చేశాయి. సిఆర్‌పిఎఫ్ బలగాలు ఈ ప్రాంత గిరిజనులను హక్కున చేసుకుని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. వారి అభివృద్దికి కావలసిన అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
సిఆర్‌పిఎఫ్ 39వ బెటాలియన్ క్యాంపు ప్రారంభించిన ఐజీ త్రివిక్రమ్ ఈ ప్రాంతాన్ని సేఫ్ ప్లేస్ గా తీర్చిదిద్దుతామన్నారు. కర్రెగుట్టల పైకి రోడ్ వే ఏర్పాటు చేసి, ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా ప్రశాంత వాతావరణం కల్పిస్తామని ప్రకటించారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని ప్రకటించారు.
బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ లో భాగంగా కర్రెగుట్టలను హస్తగతం చేసుకున్న కేంద్ర బలగాలు ఇక్కడ ప్రశాంత వాతావరణం కల్పించబోతున్నాయా..? అడుగు తీసి అడిగేస్తే బాంబుల మోతతో దద్దరిల్లిన కర్రెగుట్టలు సామాన్యులు తిరగడానికి ఎంతవరకు సేఫ్..! మరి ఈ గుట్టల చుట్టూ అమర్చిన మందు పాతరలు పూర్తిగా నిర్వీర్యం చేశారా..? ఆయుధాలు సందడి చేర్చిన చోట, ఇప్పుడు ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు..? కాకులు తిరగని ఈ కారడివిలో ఇప్పటికైనా కాల్పుల మోత ఆగనుందా..? అన్నదీ ఇప్పుడ హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి మరీ దండకారణ్యం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో..!
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..