నిజామాబాద్‌ జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌.. చేప‌ల కోసం వ‌ల వేస్తే..

|

Apr 29, 2021 | 3:20 PM

నిజామాబాద్‌ జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌ తగిలింది. రోజూ మాదిరిగానే చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లు..

నిజామాబాద్‌ జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌.. చేప‌ల కోసం వ‌ల వేస్తే..
Fishing
Follow us on

నిజామాబాద్‌ జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌ తగిలింది. రోజూ మాదిరిగానే చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లు.. వలలో చిక్కిన సంపద చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఆర్మూర్ మండలం ఖానాపూర్ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుల వలలో భారీ మొసలి చిక్కింది. మొసలిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వలలో మొసలి చిక్కిన విషయాన్ని సర్పంచ్ సింగిరెడ్డి మోహన్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ అధికారులు మాధవి, మధు గ్రామానికి చేరుకున్నారు. మొసలిని సర్పంచ్ సమక్షంలో మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

గ్రామ చెరువులో మొసలి ప్రత్యక్షం కావటం పట్ల గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో పశువులు దాహం తీర్చుకునేందుకు వస్తుంటాయని, రైతులు కూడా తరచూ చెరువు సమీపంలో పనులకు వస్తుంటారని చెబుతున్నారు. ఇప్పుడు మొసలి సంచారంతో స్థానికులు భయపడిపోతున్నారు. కాగా ఇటీవల కాలంలో చేప‌ల కోసం వ‌ల వేస్తే..అందులో మొస‌లి చిక్కిన సంద‌ర్భాలు త‌రుచుగా మ‌నం చూస్తూనే ఉన్నాం.

 

Also Read: ముఖ్యమంత్రులను వెంటాడుతున్న కరోనా.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌కు పాజిటివ్..

ఈ యువకుడు అదృష్టం కోసం పిచ్చి పని చేశాడు.. చివరికి జైలు పాలయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే.!