
కొన్ని యూట్యూబ్ చానల్స్ ఓపెన్ చేస్తే బూతు కంటెంట్ తప్ప మరొకటి ఉండదు. అది కూడా చిన్న పిల్లలతో. పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారులతో చేయకూడని పనులు చేయిస్తూ, వినలేని భాషతో కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ చేస్తూ రెచ్చిపోతున్నారు. దీనిపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు…పర్ ఎగ్జాంపుల్స్ సజ్జనార్ పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు మీరూ చూడండి, వారి భాష ఎంత దిగజారుడుగా ఉందో వినండి.
వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా!?
వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?
వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!?
చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా… pic.twitter.com/flvJeg4EHy
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 16, 2025
ఇంటర్వ్యూ ఇస్తున్న పిలగాడి వయసు మీరు అంచనా వేసే ఉంటారు. మహా అంటే 15ఏళ్లు కూడా దాటుండవు. కానీ ఆ యూట్యూబర్ అడిగే ప్రశ్నలకు ఆబాలుడు ఇచ్చే సమాధానం వింటుంటే బేజా ఫ్రై గ్యారంటీ. అంతటి దరిద్రమైన భాషను ఆపిల్లాడి చేత చెప్పిస్తున్నారు. దేనికోసం వ్యూస్ కోసం. తమ చానల్ పాపులారిటీ కోసం. ఇంకో వీడియో చూడండి
మైనర్ జంటను కూర్చోబెట్టి ఆ యూట్యాబర్ ఎలాంటి పనులు చేపిస్తున్నాడో చూశారుగా. కనీసం ఇలాంటివి అప్‌లోడ్ చేస్తే పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఇంగితం కూడా మర్చిపోతున్నారు . మినిమం సెన్స్ లేకుండా వ్యూస్ వస్తే చాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
ఆ పాప వయసు పట్టుమని పదేళ్లు కూడా ఉండవు. కడప యాసతో సీమ కామెడీ పేరుతో యూట్యూబ్ నిండా ఆపాప వీడియోలను పెట్టి క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి వాళ్లను మనమేం చేయాలి. కనిపిస్తే కొట్టాలనిపిస్తుంది కదా. ఇదే విషయాన్ని సీపీ సజ్జనార్ ట్వీట్ ద్వారా హెచ్చరించారు
సో..సీపీ సజ్జనార్ చెప్పినట్లు, పేరెంట్స్ బాధ్యతారాహిత్యం కూడా ఇక్కడ కనిపిస్తోంది. కేవలం డబ్బులు వస్తున్నాయని, ఇంత చిన్న ఏజ్‌లో పిల్లను తప్పుదారి పట్టిస్తే పెద్దయ్యాక వాళ్లేమవుతారో ఆలోచించండి. ప్రజలు కూడా ఇలాంటి కంటెంట్‌ను అస్సలు ప్రోత్సహించవద్దు. ఇలాంటి యూట్యూబ్ చానల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోకుండా పోలీసులకు రిపోర్ట్ చేయాలి.1930కు కాల్ లేదా, సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయంండి..