రెండేళ్లుగా కరోనాతో నానాఇబ్బందులు పడిన ప్రజలకు ICMR-NIN సర్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వచ్చే కరోనా వేవ్స్ మనల్ని ఏమీచేయలేవని కొండంత ధైర్యాన్నిస్తోంది. ఇప్పటికే మూడు వేవ్‌లతో నరకం అనుభవించిన జనాలకు ఫోర్త్ వేవ్ భయం కూడా పట్టుకున్న నేపథ్యంలో ICMR-NIN సర్వే ఫలితాలు ఊరటనిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో జరిపిన సర్వేలో 93శాతం మందిలో యాంటీబాడీస్ పెరిగినట్లు స్పష్టం చేసింది. వంద మందితో ప్రత్యేక బృందాలు నెలపాటు 18వేలకు పైగా రక్తనమూనాలు సేకరించాయి. తెలంగాణ ఆరోగ్య శాఖ ICMR-NINతో ఈ సర్వే చేయించింది. రాష్ట్రంలో యాంటీబాడీస్ ఏమేరకు పెరిగాయి.. యాంటీబాడీస్ పెరగడం వల్ల కరోనాను ఎదుర్కొనే శక్తిని ఏ మేరకు కూడగట్టుకున్నాం అనే అంశాలపై సర్వే చేసింది.
సీరో సర్వే ఫలితాలతో అటు ప్రజలకు.. ఇటు ప్రభుత్వానికి భరోసా ఏర్పడింది. యాంటీ బాడీస్ పెరగడం వల్ల ఎలాంటి వైరస్‌నైనా తట్టుకునే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు వైద్యనిపుణులు. పాండమిక్ జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను ఈజీగా గెలవచ్చంటున్నారు.
ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టడంతో సాఫ్ట్‌వేర్ సంస్థలు వర్క్‌ఫ్రం హోం నిబంధనను సడలిస్తున్నాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయనడానికి ఈ సర్వే ఫలితాలే నిదర్శనంగా నిదర్శనమంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..
Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?