Telangana Corona: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 239 మందికి పాజిటివ్

|

Sep 24, 2021 | 10:11 PM

తెలంగాణలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Telangana Corona: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 239 మందికి పాజిటివ్
Corona
Follow us on

తెలంగాణలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,650కు చేరుకుంది. ఇక, నిన్న కరోనా బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహమ్మారి ధాటికి బలైనవారి సంఖ్య 3,911 కు చేరింది. అదే సమయంలో 336 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తంగా చూస్తే.. 6,55,961మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,778 మంది ప్రస్తుతం కోవిడ్ చికిత్స పొందుతున్నారు. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 2,61,04,976 నమూనాలు పరీక్షించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలావుంటే.. దేశంలో కొత్త కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. టీకాల సంఖ్య కూడా 83 కోట్లు దాటింది. ఇకపై కరోనా టీకాలను ఇళ్ళ వద్దే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం మార్గదర్శకాలు జారీ చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ గురువారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. కేంద్రానికి వెళ్లలేని వారికి ఇంటి టీకాలు ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. దీని కోసం ఒక సూచన జారీ చేశారు. టీకా కేంద్రానికి వెళ్లలేని వ్యక్తులు టీకాలు వేసుకునేలా చూసుకోవాలని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..

CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..