ఇవాళ గ్రేటర్‌ హైదరాబాద్‌‌లో డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌.. పేర్లు నమోదు చేయించుకున్నారా..

|

Jun 03, 2021 | 7:29 AM

హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని వాహనాల డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. ఇందుకోసం సదరు.. ఆర్టీసీ, ఆటో, కార్ల డ్రైవర్లు తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి...

ఇవాళ గ్రేటర్‌ హైదరాబాద్‌‌లో డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌.. పేర్లు నమోదు చేయించుకున్నారా..
Covid Vaccination
Follow us on

RTC bus, auto, cab drivers to be vaccinated : కరోనా వైరస్ రెండో దశను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ముందుగా పది రోజుల పాటు సూపర్ స్పైడర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగాంగా ఈ రోజు (గురువారం) నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని వాహనాల డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. ఇందుకోసం సదరు.. ఆర్టీసీ, ఆటో, కార్ల డ్రైవర్లు తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుెంది. ఈ లింక్ ద్వారా డ్రైవర్లు తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

https://tgtransport.net/TGCFSTONLINE/OnlineTransactions/VaccineRegistrationNew.aspx ఆన్ లైన్లో పైన చెప్పిన సైట్లోకి వెళ్లి డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. కాగా, కరోనా సమయంలోనూ కుటుంబ పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు బస్సు, ఆటో డ్రైవర్లు. కేసీఆర్ సర్కారుతో ఫ్రంట్ లైన్ వర్కర్ల హోదా పొందిన ఆటో డ్రైవర్లు ఈనెల 3వ తేదీ నుంచి కరోనా టీకాలు వేయించుకోవచ్చని ప్రకటించింది.

గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 2.50 లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లకు ఇవాళ్టి నుంచి వ్యాక్సినేషన్‌ చేయబోతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆటో డ్రైవర్లు వ్యాక్సిన్‌ కోసం తమ పేర్లను సంబంధిత ఆర్టీఓల వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుని టోకెన్లు పొందాలని టీఆర్‌ఎస్‌కేవీ ఆటో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : Heavy Rains: కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

‘పీఎం సార్.. ఫేర్‌వెల్ పార్టీకి అవకాశం ఇవ్వండి.. ఆమెను చీరలో చూడాలి’ స్టూడెంట్ వైరల్ ట్వీట్..!