Covid-19 Cases in Telangana: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం మూడు, నాలుగు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 306 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,59,313 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 3,883 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
తాజాగా రాష్ట్రంలో కరోనా నుంచి 366 మంది కోలుకఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,49,757 మంది కోలుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.55 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 69,422 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి రాష్ట్రంలో 24917603 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజాగా జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులు..
ఆదిలాబాద్- 2, భద్రాది కొత్తగూడెం -8, జీహెచ్‌ఎంసీ -78, జగిత్యాల-12, జనగామ-4, జయశంకర్ భూపాలపల్లి-1, జోగులాంబ గద్వాల -1, కామారెడ్డి- 3, కరీంనగర్-31, ఖమ్మం- 14, కొమురంభీం ఆసిఫాబాద్- 2, మహబూబ్‌నగర్-4, మహబూబాబాద్-4, మంచిర్యాల-7, మెదక్-2, మేడ్చల్ మల్కాజ్‌గిరి-16, ములుగు -3, నాగర్ కర్నూల్ – 0, నల్గొండ-14, నారాయణపేట-3, నిర్మల్ -2, నిజామాబాద్-4, పెద్దపల్లి-10, రాజన్న సిరిసిల్ల-7, రంగారెడ్డి-12, సంగారెడ్డి-3, సిద్దిపేట-6, సూర్యాపేట-8, వికారాబాద్- 4, వనపర్తి-3, వరంగల్ రూరల్-6, వరంగల్ అర్బన్-23, యాదాద్రి భువనగిరి-6 చొప్పున పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read: