Covid-19 Hospital Bed Availability: తెలంగాణలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. దీంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన అధికారిక వెబ్‌సైట్లో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఎన్ని భర్తీ ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూలోని వెంటిలేటర్ బెడ్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని భర్తీ ఉన్నాయి.. ఇలా పూర్తి వివరాలు ప్రభుత్వం రిపోర్టు చేస్తోంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 5156 బెడ్స్ ఉండగా, అందులో 1189 బెడ్లు భర్తీ ఉండగా, 3967 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మొత్తం 15298 బెడ్స్ ఉండగా, అందులో 33483 భర్తీ ఉండగా, 11952 ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో .. మొత్తం ఆక్సిజన్ బెడ్స్ 6512 ఉండగా, అందులో 3387 బెడ్లు నిండి ఉండగా, 3125 ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మొత్తం ఆక్సిజన్ బెడ్స్10627ఉండగా, 6770 బెడ్స్ భర్తీ ఉండగా, 3859 బెడ్స్ ఖాలీగా ఉన్నాయి.
ఐసీయూలో వెంటిలేటర్ బెడ్స్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. మొత్తం ఐసీయూలో బెడ్స్ 2150 ఉండగా, 1357 భర్తీ ఉండగా, 793 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో .. మొత్తం ఐసీయూ బెడ్స్ 7211 ఉండగా, అందులో 4545 బెడ్స్ భర్తీ ఉండగా, 2667 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం బెడ్స్ 13818 ఉండగా, అందులో 5933 బెడ్స్ భర్తీ ఉండగా, 7885బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 33136 బెడ్స్ ఉండగా, అందులో 14663 బెడ్స్ భర్తీ ఉండగా, 18478 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
అయితే ఈ లెక్కన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రెగ్యులర్ బెడ్స్ మొత్తం 20454 ఉండగా, అందులో 4537 నిండి ఉన్నాయి. ఇక 15919 ఖాళీగా ఉన్నాయి. ఇక ఆక్సిజన్ బెడ్స్ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 17139 బెడ్స్ ఉండగా, 10157 భర్తీ కాగా, ఖాళీగా 6984 ఉన్నాయి. అలాగే ఐసీయూలోని వెంటిటేటర్ బెడ్స్ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 9361 ఉండగా, 5902 భర్తీ కాగా, 3460 ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అన్ని విభాగాలలలో మొత్తం బెడ్స్ 46954 ఉండగా, అందులో 20596 భర్తీ అయ్యాయి. ఇక 26363 ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తన వెబ్‌సైట్లో పొందుపర్చింది.
కరోనా అలర్ట్..! పడుకునే పద్దతి ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చు.. ఎలాగో మీరే తెలుసుకోండి..