ఓరుగల్లులో దుమారం రేపుతున్న ఎన్‌కౌంటర్స్ – కౌంటర్ పాలిటిక్స్.. సవాల్ ప్రతి సవాల్‌తో రచ్చ!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలతో ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ నియోజక వర్గoలో మాత్రం నక్సల్స్ ఎన్‌కౌంటర్లు చుట్టూ రాజకీయం తిరుగతోంది. అభ్యర్థి, ప్రత్యర్థి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలతో ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ నియోజక వర్గoలో మాత్రం నక్సల్స్ ఎన్‌కౌంటర్లు చుట్టూ రాజకీయం తిరుగతోంది. అభ్యర్థి, ప్రత్యర్థి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రక్త చరిత్ర పాపం ఎవరిదంటూ ఒకరినొకరు ఎదురు దాడికి దిగుతున్నారు. అమాయకులకు ఎన్‌కౌంటర్ చేయించిన చరిత్ర మీదంటూ అధికార పార్టీ అభ్యర్థిపై విమర్శల ఎక్కుపెడితే, ఆ ఎన్‌కైంటర్లకు ఆద్యం పోసింది మీ పార్టీ అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి కౌంటర్ అటాక్‌కు దిగుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గమేది.? ఎందుకు ఎన్నికల వేల అక్కడ ఎన్‌కౌంటర్లు హాట్ టాపిక్ అయ్యాయి..! వాచ్ ది స్టోరీ
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని బరిలోకి దింపింది ఆ పార్టీ అధిష్టానం. కడియం శ్రీహరి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగిస్తూనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా పనిలో పడ్డారు. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రతిపక్షాలపై విమర్శల దాడికి ఎక్కుపెట్టారు. గతంలో మంత్రిగా, ఉప ముఖ్యమoత్రిగా తాను చేసిన అభివృద్దే తనను గెలిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సింగపురం ఇందిరా, బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కడియం దళిత దొర అని విమర్శలు గుప్పించారు. అంతేకాదు కడియం శ్రీహరి గతంలో మంత్రిగా పని చేసిన సమయంలో అమాయకులపై నక్సలైట్ ముద్ర వేసి ఎన్‌కౌంటర్ చేయించారని ఆరోపించారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో 400 మందికి పైగా ఎన్‌కౌంటర్ పేరుతో అమాయకులను కాల్చి చంపితే, అందులో ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండే సుమారు 100కు పైగా మందిని బలితీసుకున్న చరిత్ర కడియం శ్రీహరి ది అని ఆరోపించారు. అమాయకులను ఎన్‌కౌంటర్లు చేయించిన చరిత్ర కడియం శ్రీహరి అని విమర్శలు చేశారు.. ఈసారి ఎన్నికల్లో కడియం శ్రీహరికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ సింగపురం ఇందిర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి కూడా ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ సర్కార్ మావోయిస్టులను చర్చల పేరుతో పిలిచి, వాళ్ల స్థావరాలు తెలుసుకొని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఎదురుదాడికి దిగారు కడింయ. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సింగపురం ఇందిర, చౌకబారు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి, సింగపురం ఇందిర ఇద్దరు చీటర్స్ అని మండిపడ్డారు కడియం. రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నక్సలైట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయని, ఆ ఎన్‌కౌంటర్లకు కాంగ్రెస్ బాధ్యత వహిస్తే, తాను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్లకు బాధ్యతగా ఇస్తానన్నారు కడియం శ్రీహరి. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు కడియం.
రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అభివృద్ధి ఎజెండా, పార్టీల మేనిఫెస్టో పైన మాటల యుద్ధం కొనసాగుతుంటే, ఈ నియోజకవర్గంలో మాత్రం ఎన్‌కౌంటర్లపై పరస్పర విమర్శలు, మాటలు యుద్ధం కొనసాగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…