తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,061 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,18,837కి చేరింది. ఇందులో 15,524 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,99,695 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1556 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 11 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3618కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,20,397 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,81,28,055కి చేరింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 47, జీహెచ్ఎంసీ 135, జగిత్యాల 20, జనగాం 11, జయశంకర్ భూపాలపల్లి 21, గద్వాల్ 5, కామారెడ్డి 3, కరీంనగర్ 80, ఖమ్మం 52, ఆసిఫాబాద్ 6, మహబూబ్ నగర్ 23, మహబూబాబాద్ 44, మంచిర్యాల 51, మెదక్ 6, మేడ్చల్ 47, ములుగు 22, నాగర్ కర్నూల్ 12, నల్గొండ 65, నారాయణపేట 8, నిర్మల్ 3, నిజామాబాద్ 10, పెద్దపల్లి 53, రాజన్న సిరిసిల్ల 19, రంగారెడ్డి 66, సంగారెడ్డి 14, సిద్ధిపేట 50, సూర్యాపేట 67, వికారాబాద్ 12, వనపర్తి 16, వరంగల్ రూరల్ 17, వరంగల్ అర్బన్ 46, యదాద్రి భోనగిరిలో 27 కేసులు నమోదయ్యాయి.
Also Read:
ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!
ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!