Corona Cases Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 నమూనాలను పరీక్షించగా 2,524 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,78,351కి చేరింది. మరో 18 మంది కరోనా కారణంగా మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 3281కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 34,084 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. నిన్న 3,464 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా 5,40,986 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 307 మందికి పాజిటివ్‌గా తేలింది.
కరోనా కట్టడిలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం నాడు 24,897 మందికి వ్యాక్సిన్ వేశారు. నేడు గ్రేటర్ హైదరాబాద్‌లోని 31 కేంద్రాల్లో కొనసాగిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగింది. ఈ వ్యాక్సినేషన్ కేంద్రాలను పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో జిహెచ్ఎంసిలో అమలు చేస్తున్న అన్నపూర్ణ ఉచిత భోజనం కార్యక్రమంలో భాగంగా నేడు 75,600 ఉచిత భోజనాలను పంపిణీ చేయడం జరిగింది. గ్రేటర్‌లో రెండో విడత ఫీవర్ సర్వేలో భాగంగా 90,567 ఇళ్లలో ఫీవర్ సర్వే నిర్వహించారు.