TS Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. దాంతో వాతావరణం చల్లగా ఉంటోంది. సూర్యడు ఉదయించినప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పడమటి గాలులు వీస్తున్నాయని, వాటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణం కూల్‌గా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఒకటి, రెడు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. పశ్చిమ దిశ నుంచి కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంటుందని అన్నారు. రానున్న మూడు రోజుల పాటు ఉదయం సమయంలో వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపారు. అయితే, మధ్యాహ్నం మాత్రం పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయన్నారు. కాగా, ఆదివారం నాడు హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 29.9, 29.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నల్లగొండ, భద్రాచలంలో 33 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయయిన వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Also read:
Sukumar: డైరెక్టర్ సుకుమార్ పెద్ద మనసు.. తండ్రి జ్ఞాపకార్థంగా సొంత గ్రామంలో…
Central Govt Scheme: మీరు పాడి రైతులా?.. అయితే రూ. 5 లక్షలను పొందండి.. పూర్తి వివరాలు మీ కోసం..