Water Project Security: రోజు రోజుకు ముదురుతున్న జలవివాదం.. పోలీసు పహారాలోకి ప్రాజెక్టులు..

కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. నాగార్జునసాగర్‌ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని...

Water Project Security: రోజు రోజుకు ముదురుతున్న జలవివాదం.. పోలీసు పహారాలోకి ప్రాజెక్టులు..
Weater Project Security Pro

Updated on: Jul 02, 2021 | 9:46 AM

కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. నాగార్జునసాగర్‌ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని మాట్లాడేందుకు వస్తున్న ఏపీ అధికారులకు నో ఎంట్రీ అంటున్నారు తెలంగాణ పోలీసులు…

పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఆ ప్రాజెక్టు ఎస్‌.ఇ తెలంగాణ జెన్‌కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. జూరాల డ్యాంపైకి తెలంగాణ రాకపోకలు నిలిపివేయగా, ఆర్డీఎస్‌ కుడికాలువ వద్ద ఏపీ.. పోలీసు బలగాలను మోహరించింది. శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించగా, పోతిరెడ్డిపాడు వద్ద పోలీసులను పెంచి ఆంధ్రప్రదేశ్‌ ఎవరినీ అనుమతించడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ జిల్లాల ఎస్పీలు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ గట్టిగా కోరుతోంది. అయితే 841 అడుగుల దిగువన ఉన్నప్పుడు నీటిని తీసుకోవడానికి అవకాశం లేదంటూ రాయలసీమ ప్రాజెక్టును కొనసాగించడానికి ఏపీ ప్రయత్నిస్తోంది.

ఈ వివాదం నేపథ్యంలో కృష్ణాపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టడంతోపాటు పూర్తి స్థాయిలో జల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలు పరస్పరం బోర్డుకు ఫిర్యాదులు చేసుకొంటూనే ఇంకోవైపు విద్యుదుత్పత్తి, ఆయకట్టుకు నీటివిడుదల, నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. వీటికి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి: Modi Cabinet reshuffle: కేంద్ర కేబినెట్‌ విస్తరణపై కసరత్తు పూర్తి..! కొత్తగా 28 మందికి ఛాన్స్..!

Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్