Congress Leader: కాంగ్రెస్ నేత వీహెచ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా..? అందుకే సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారా?.. వీహెచ్ స్పందన ఇదీ..

Congress Leader: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం నాడు లోయర్ ..

Congress Leader: కాంగ్రెస్ నేత వీహెచ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా..? అందుకే సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారా?.. వీహెచ్ స్పందన ఇదీ..

Updated on: Jan 03, 2021 | 6:31 PM

Congress Leader: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం నాడు లోయర్ ట్యాంక్‌బండ్‌లో మున్నూరుకాపు మహాసభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న విహెచ్.. సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలను ప్రోత్సహిస్తున్నారని కితాబిచ్చారు. ప్రతీ కులానికి ఆ కుల సంఘం భవన నిర్మాణం కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తున్నారని, ఇది మంచి విషయం అని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కుల సంఘాలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.

టీఆర్ఎస్‌లోకి వీహెచ్..?
ఇదిలాఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిపై ప్రశంసించి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఇదే విషయమై టీవీ9 ఆయన్ను సంప్రదించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను టీఆర్ఎస్‌లో చేరుతాననే విషయంపై ఇప్పుడే స్పందించనని అన్నారు. అలాగని ఆ వార్తలను ఖండించను అని కూడా అన్నారు. అందరూ రహస్యంగా వెళ్లి కలుస్తారని, తాను మాత్రం అలా కాదని వీహెచ్ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం చేసిన కొన్ని పనులు మంచిగా ఉన్నాయని, అందుకే అభినందించానని వీహెచ్ చెప్పుకొచ్చారు.

 

Also read:

Tadipatri Clashes: రగులుతున్న తాడిపత్రి.. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష నిర్ణయం.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి..

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ని ప్రత్యామ్నాయ మందుగా వాడవచ్చు, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా.. సీరం మందు బెస్ట్ అని వెల్లడి