భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ని ప్రత్యామ్నాయ మందుగా వాడవచ్చు, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా.. సీరం మందు బెస్ట్ అని వెల్లడి

రానున్న రోజుల్లో భారత్ బయో టెక్ వ్యాక్సిన్ ని బ్యాకప్ (ప్రత్యామ్నాయ) టీకామందుగా వినియోగించవచ్ఛునని ఢిల్లీ ఎయిమ్స్  డైరెక్టర్డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ని ప్రత్యామ్నాయ మందుగా వాడవచ్చు, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా.. సీరం మందు బెస్ట్ అని వెల్లడి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2021 | 5:03 PM

రానున్న రోజుల్లో భారత్ బయో టెక్ వ్యాక్సిన్ ని బ్యాకప్ (ప్రత్యామ్నాయ) టీకామందుగా వినియోగించవచ్ఛునని ఢిల్లీ ఎయిమ్స్  డైరెక్టర్డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. మరికొన్ని రోజుల్లో సీరం సంస్థ వ్యాక్సిన్ ప్రధానమైనదిగా ఉంటుందని, రీ ఇన్ఫెక్షన్ సమయంలో ఎమర్జెన్సీ వినియోగం కోసం భారత్ బయోటెక్ వారి వ్యాక్సిన్ ని వాడవచ్చునని ఆయన చెప్పారు. అప్పటికల్లా ఈ సంస్థ వారి డోసేజీ సిద్డంగా ఉంటుందని, తమ మూడో దశ ట్రయల్స్ పూర్తి అయ్యాయని చూపడానికి వారికి వీలుంటుందని అన్నారు. ఇప్పటికే భారత్ సంస్థ టీకామందుపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా..మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకుండా దీనికి హడావుడిగా అనుమతించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రణదీప్ గులేరియా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రానున్న వారాల్లో సీరం వారి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, 50 మిలియన్ డోసుల మందు రెడీగా ఉంటుందని ఆయన చెప్పారు. కాగా కొవాగ్జిన్ తొలి , రెండో దశ ట్రయల్స్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పూర్తి చేసింది. మూడో ఫేజ్ ట్రయల్స్ జరుగుతున్నాయని, 22,500 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోందని ఈ సంస్థ హెడ్ వీజీ.సోమానీ వెల్లడించారు.